BREAKING
భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు మందపల్లి ఆలయంలో పోటెత్తిన భర్త జనం రాజకీయాలలో గెలుపుఓటములు సహజం : సమిష్టిగా పనిచేసే పట్టణ అభివృద్ధికి కృషిచేద్దాం : పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం : మదనపల్లి మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు హామీ తుఫాన్ దాటికి బాధితుల ఆవేదం చిన్నారుల ఆనందమే మా లక్ష్యం... రాజేంద్రనగర్ ప్రజల ప్రేమాభిమానాలు మరువలేను అమ్మవారి సేవా కార్యక్రమాలకు రూ.2.01 లక్షల విరాళాలు అమ్మవారి సేవా కార్యక్రమాలకు రూ.2.01 లక్షల విరాళాలు భక్తులకు అన్నప్రసాద ఏర్పాట్ల పరిశీలన కార్తీక మాసంలో వైభవంగా సహస్ర లింగార్చన సింగరేణిలో ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు.. స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నెహ్రూ జీవిత చరిత్ర వివరించిన ఎంఈవో ఖాసీం పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ విద్యార్థులు బాల్యం నుండే మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఎండి ఖాసీం అన్నారు. గురువారం పిడుగురాళ్ల పట్టణంలోని మండల ప్రాథమిక పాఠశాల ఎస్ఆర్ (జము *కుందుర్పిమండలంలో పంచాయతీ పోరు రసవత్తరం* తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నాన్ని ఖండిస్తున్నాం

స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం

Select Suryaa Now
స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం

పెనమలూరు, మేజర్ న్యూస్ : ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తప్పనిసరిగా పాటించాలని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు స్పష్టం చేశారు. తాడిగడప, గుడివాడ మున్సిపాలిటీలతో పాటు మూడు విడతల్లో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పెనమలూరు పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్నికల నిబంధనలు, భద్రతా ఏర్పాట్లపై ఆయన వివరించారు. రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ప్రచార ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించాలంటే ముందస్తుగా పోలీస్, రెవెన్యూ అధికారుల అనుమతులు పొందాలని సూచించారు. ప్రచారంలో ఇతర పార్టీలకు, అభ్యర్థులకు ఇబ్బందులు కలిగించడం, కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయడం, ఓటర్లకు డబ్బు, మద్యం, ఇతర వస్తువులతో ప్రలోభపెట్టడం వంటివి నిషేధమని తెలిపారు. ఇతరుల వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించడం, ప్రత్యర్థి పార్టీల జెండాలు, పోస్టర్లు తొలగించడం, ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడరాదన్నారు. లౌడ్‌స్పీకర్ల వినియోగానికి ముందస్తు అనుమతి తీసుకోవాలని, నిర్ణీత సమయ పరిమితులు పాటించాలని, అనుమతించిన కార్యక్రమాలకే వాటిని వినియోగించాలని స్పష్టం చేశారు. ఆస్పత్రులు, వైద్యశాలల పరిసరాల్లో శబ్ద కాలుష్యం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, అధిక శబ్దంతో నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఊరేగింపుల తేదీ, సమయం, ప్రారంభ, ముగింపు ప్రదేశాలను ముందుగానే నిర్ణయించి స్థానిక పోలీసుల అనుమతి పొందాలని, నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు ముగ్గురికి మించి రాకూడదని సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన తాజా ఉత్తర్వులు, నిబంధనలను ప్రతి ఒక్కరూ అనుసరించాలని కోరారు. ఎన్నికల వేళ అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పోలీస్ శాఖ పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపడుతోందని, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచడంతో పాటు నిబంధనల ఉల్లంఘనలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించినా, అనుమతులు లేకుండా ప్రచార కార్యక్రమాలు నిర్వహించినా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఓటర్లు ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీస్ శాఖ అన్ని చర్యలు తీసుకుంటుందని, ఎన్నికల ప్రశాంతతకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు. సమావేశంలో డీఎస్పీ కడలి జయకృష్ణ, పెనమలూరు సీఐ ఎన్. వెంకట నారాయణ, ఎస్‌ఐలు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.