బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నెహ్రూ జీవిత చరిత్ర వివరించిన ఎంఈవో ఖాసీం పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ విద్యార్థులు బాల్యం నుండే మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఎండి ఖాసీం అన్నారు. గురువారం పిడుగురాళ్ల పట్టణంలోని మండల ప్రాథమిక పాఠశాల ఎస్ఆర్ (జము
పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్: విద్యార్థులు బాల్యం నుండే మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఎండి ఖాసీం అన్నారు.
గురువారం పిడుగురాళ్ల పట్టణంలోని మండల ప్రాథమిక పాఠశాల ఎస్ఆర్ (జమున స్కూల్), బ్రాహ్మణపల్లిలోని మండల ప్రాథమిక ఉర్దూ పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా మన దేశ మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ జయంతి (బాలల దినోత్సవం)ని పురస్కరించుకుని విద్యార్థులకు నెహ్రూ జీవిత చరిత్రను వివరించారు. నెహ్రూ పిల్లల పట్ల ఎంత ప్రేమగా ఉండేవారో, దేశానికి చేసిన సేవలను విద్యార్థులకు తెలియజేశారు.
విద్యార్థులు అలాంటి మహనీయులను ఆదర్శంగా తీసుకొని వారి జీవిత చరిత్రలను చదవాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రక్కు నాయక్, హాజ్రా పర్వీన్ మరియు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
వెంకట్ జర్నలిస్ట్ పిడుగురాళ్ల