BREAKING
భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు మందపల్లి ఆలయంలో పోటెత్తిన భర్త జనం రాజకీయాలలో గెలుపుఓటములు సహజం : సమిష్టిగా పనిచేసే పట్టణ అభివృద్ధికి కృషిచేద్దాం : పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం : మదనపల్లి మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు హామీ తుఫాన్ దాటికి బాధితుల ఆవేదం చిన్నారుల ఆనందమే మా లక్ష్యం... రాజేంద్రనగర్ ప్రజల ప్రేమాభిమానాలు మరువలేను అమ్మవారి సేవా కార్యక్రమాలకు రూ.2.01 లక్షల విరాళాలు అమ్మవారి సేవా కార్యక్రమాలకు రూ.2.01 లక్షల విరాళాలు భక్తులకు అన్నప్రసాద ఏర్పాట్ల పరిశీలన కార్తీక మాసంలో వైభవంగా సహస్ర లింగార్చన సింగరేణిలో ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు.. స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నెహ్రూ జీవిత చరిత్ర వివరించిన ఎంఈవో ఖాసీం పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ విద్యార్థులు బాల్యం నుండే మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఎండి ఖాసీం అన్నారు. గురువారం పిడుగురాళ్ల పట్టణంలోని మండల ప్రాథమిక పాఠశాల ఎస్ఆర్ (జము *కుందుర్పిమండలంలో పంచాయతీ పోరు రసవత్తరం* తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నాన్ని ఖండిస్తున్నాం

తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నాన్ని ఖండిస్తున్నాం

Select Suryaa Now
తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నాన్ని ఖండిస్తున్నాం

పాల్వంచ, సూర్య(మేజర్ న్యూస్)- తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై జరిగిన హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మల్లెల వీరనారాయణ తెలిపారు.శనివారం పాల్వంచ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అన్నాజీపూర్ గ్రామం సమీపంలో బీసీ రాజ్యాధికార పాదయాత్ర నిర్వహిస్తున్న మల్లన్న కాన్వాయ్‌ను లారీతో అతివేగంగా ఢీకొట్టి హత్యాయత్నానికి పాల్పడటం దారుణమని అన్నారు. బీసీ పాదయాత్రను అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ఈ దాడి జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు.గతంలో ఇదే భువనగిరి ప్రాంతంలో బీసీల హక్కుల కోసం పోరాడిన మారోజు వీరన్న, బెల్లి లలితక్క, సాంబశివుడు వంటి ఉద్యమకారులపై జరిగిన దాడులను గుర్తుచేస్తూ, అదే తరహాలో మల్లన్నను అంతమొందించేందుకు కుట్ర జరిగిందా అనే కోణంలో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణమే స్పందించి నిష్పక్షపాత విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. మల్లన్నకు ఎలాంటి ప్రాణహాని కలగకుండా Z+ కేటగిరీ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.మల్లన్నకు ఏదైనా ప్రాణహాని జరిగితే బీసీ ఉద్యమ శ్రేణులంతా తీవ్రంగా స్పందిస్తామని, బీసీ రాజ్యాధికార సాధన కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంగా ఉంటామని స్పష్టం చేశారు.ఈ ప్రెస్‌మీట్‌లో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకిరెడ్డి శ్రీనివాస్, పాల్వంచ పట్టణ అధ్యక్షులు అటికేటి శంకర్, పట్టణ మహిళా అధ్యక్షురాలు మల్లెల నాగమణి, బూర్గంపాడు మండల అధ్యక్షులు వట్టికోట రామకృష్ణ, అశ్వాపురం మండల అధ్యక్షులు విలాసాగరం కోటేశ్వరరావు, సుజాతనగర్ మండల యూత్ అధ్యక్షులు మంద ఉమామహేశ్వరరావు, సుజాతనగర్ సోషల్ మీడియా కన్వీనర్ రష్మిక తదితరులు పాల్గొన్నారు.