కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదలకు చేయూత
పాల్వంచ, సూర్య(మేజర్ న్యూస్)- కాంగ్రెస్ ప్రభుత్వంలోనే నిరుపేద, బలహీన వర్గాలకు చేయూత లభిస్తుందని పాల్వంచ సొసైటీ అధ్యక్షులు కొత్వాల శ్రీనివాసరావు అన్నారు.శనివారం పాత పాల్వంచ 46వ డివిజన్‌లో కార్పొరేటర్ కొత్వాల విమలాదేవి ఆధ్వర్యంలో మహిళలకు చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్వాల దంపతులు పాల్గొని లబ్ధిదారులకు స్వీట్లు పంచిపెట్టారు.ఈ సందర్భంగా కొత్వాల మాట్లాడుతూ, ఒకే దఫా 4.50 లక్షల చేయూత పింఛన్లు మంజూరు చేయడం ఒక్క కాంగ్రెస్‌కే సాధ్యమని అన్నారు. పాల్వంచ పట్టణ మండలానికి మొత్తం 1387 చేయూత పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.అనంతరం లబ్ధిదారులు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మల్లు భట్టి విక్రమార్క, సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీలు రామసహాయం రఘురాంరెడ్డి, రేణుక చౌదరి ఫొటోలతో ఉన్న ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసి, కాంగ్రెస్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు.ఈ కార్యక్రమంలో వార్డ్ ఆఫీసర్ దామెర్ల నరేష్, నాయకులు సయ్యద్ యాకూబ్, కఠారు చంద్రశేఖర్ రావు, షేక్ ఖాజామియా, షేక్ కరీం, బొందిల శేషగిరి తదితరులు పాల్గొన్నారు.