BREAKING
భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా చర్యలు మందపల్లి ఆలయంలో పోటెత్తిన భర్త జనం రాజకీయాలలో గెలుపుఓటములు సహజం : సమిష్టిగా పనిచేసే పట్టణ అభివృద్ధికి కృషిచేద్దాం : పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికీ అండగా ఉంటాం : మదనపల్లి మునిసిపల్ చైర్మన్ శ్రీరామ్ చినబాబు హామీ తుఫాన్ దాటికి బాధితుల ఆవేదం చిన్నారుల ఆనందమే మా లక్ష్యం... రాజేంద్రనగర్ ప్రజల ప్రేమాభిమానాలు మరువలేను అమ్మవారి సేవా కార్యక్రమాలకు రూ.2.01 లక్షల విరాళాలు అమ్మవారి సేవా కార్యక్రమాలకు రూ.2.01 లక్షల విరాళాలు భక్తులకు అన్నప్రసాద ఏర్పాట్ల పరిశీలన కార్తీక మాసంలో వైభవంగా సహస్ర లింగార్చన సింగరేణిలో ఏఐటీయూసీ రిలే నిరాహార దీక్షలు.. స్వేచ్ఛాయుత ఎన్నికలే లక్ష్యం బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు నెహ్రూ జీవిత చరిత్ర వివరించిన ఎంఈవో ఖాసీం పిడుగురాళ్ల రూరల్ మేజర్ న్యూస్ విద్యార్థులు బాల్యం నుండే మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడుచుకోవాలని పిడుగురాళ్ల మండల విద్యాశాఖ అధికారి ఎండి ఖాసీం అన్నారు. గురువారం పిడుగురాళ్ల పట్టణంలోని మండల ప్రాథమిక పాఠశాల ఎస్ఆర్ (జము *కుందుర్పిమండలంలో పంచాయతీ పోరు రసవత్తరం* తీన్మార్ మల్లన్నపై హత్యాయత్నాన్ని ఖండిస్తున్నాం

కొత్తగూడెం నుంచి సత్తుపల్లికి బదిలీలు నిలిపివేయాలి

Select Suryaa Now
కొత్తగూడెం నుంచి సత్తుపల్లికి బదిలీలు నిలిపివేయాలి

కొత్తగూడెం సింగరేణి, సూర్య(మేజర్ న్యూస్)- కొత్తగూడెం ఏరియా నుండి సత్తుపల్లి ఏరియాకు క్లరికల్ సిబ్బంది మరియు అధికారుల బదిలీలను నిలిపివేయాలని ఐఎన్టీయూసీ నేతలు డిమాండ్ చేశారు.ఈ మేరకు కొత్తగూడెం ఏరియా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, జీఎం కార్యాలయ ఐఎన్టీయూసీ ఫిట్ సెక్రటరీ సీహెచ్ సాగర్ శనివారం జీఎం (పర్సనల్) ఐఆర్ అండ్ పీఎం కిరణ్ కుమార్‌కు మెమోరాండం అందజేశారు.ఈ సందర్భంగా రజాక్ మాట్లాడుతూ, కొత్తగూడెం ఏరియాలో ఇప్పటికే తీవ్ర సిబ్బంది కొరత నెలకొని ఉందని తెలిపారు. వివిధ విభాగాలలో క్లరికల్ సిబ్బంది మరియు అధికారుల కొరత వల్ల ప్రస్తుతం ఉన్న సిబ్బందితోనే రోజువారీ పరిపాలనా విధులు, కార్యాలయ కార్యకలాపాలు నిర్వహించడం ఇబ్బందికరంగా మారిందన్నారు.
ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ పనిచేస్తున్న సిబ్బందిని సత్తుపల్లి ఏరియాకు బదిలీ చేస్తే పరిపాలనా కార్యకలాపాలపై తీవ్ర ప్రభావం పడుతుందని, మిగిలిన సిబ్బందిపై అదనపు పనిభారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అందువల్ల ప్రతిపాదిత బదిలీలను పునఃపరిశీలించి నిలిపివేయాలని కోరారు.దీనికి జీఎం (పర్సనల్) సానుకూలంగా స్పందించి, ఈ అంశాన్ని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి బదిలీ ప్రక్రియను పునఃపరిశీలించేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.