BREAKING
రైతులకు అండగా ఉంటాం మాజీ చైర్మన్ కాంటే కార్ మధుమోహన్ ఆసియాలో టాప్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి గమ్యస్థానంగా అవతరించిన భారత్: 5.5 బిలియన్ డాలర్ల నిధుల ప్రవాహం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: తుది అడ్డంకులపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర స్పందన ఆధునిక నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరోసిటీలో ఘనంగా ‘అవెనీర్–2026’ వార్షిక క్రీడోత్సవం మాక్ గ్రామ సభ నిర్వహించిన చిన్నారులకు బహుమతి అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ క్రమశిక్షణ పట్టుదల తో లక్ష్యాలు సాధించాలి నెహ్రూ ఘన నివాళి కౌన్సిలర్లకు ఘన సన్మానం నూతన ఎస్సై తిరుపతిని మర్యాదపూర్వకంగా కలిసిన కొడకండ్ల మండల ప్రెస్ క్లబ్ సభ్యులు విశ్రాంతి గది నిర్మాణానికి రూ 10 లక్షలు విరాళం బాలల అభిప్రాయాలకు గౌరవిస్తూ వారి సమస్యలను పరిష్కరిద్దాం ఇమాంపూర్ గ్రామంలో భారీ వాహనాల బీభత్సం బాలాజీ కుటుంబానికి శ్రీ రాజ్య తండా నాయకుల పరామర్శ విద్యార్థులు గ్రంధాలయాలు సద్వినియోగం చేసుకోవాలి

క్రమశిక్షణ పట్టుదల తో లక్ష్యాలు సాధించాలి

Select Suryaa Now
క్రమశిక్షణ పట్టుదల తో లక్ష్యాలు సాధించాలి

నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంవిద్యార్థులు స్పష్టమైన లక్ష్యాలను ఎంచుకుని క్రమశిక్షణ, కృషి, పట్టుదలతో చదివి తల్లిదండ్రులకు, కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఏలూరు ఎస్.పి.డి.బి.టి. విశ్రాంతి ప్రిన్సిపాల్, సొసైటీ గవర్నింగ్ బాడీ మెంబర్ సి.హెచ్. శ్యాంబాబు అన్నారు. శనివారం స్థానిక ఆనంద్ ఎడ్యుకేషనల్ జూనియర్, వొకేషనల్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఎం. విక్రమ్ అధ్యక్షతన ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన  శ్యాంబాబు మాట్లాడుతూ.. మెట్ట ప్రాంతంలో సామాన్యులకు ఆనంద్ విద్యాసంస్థలు అత్యుత్తమ విద్యను అందిస్తున్నాయని కొనియాడారు. చైర్మన్ డి. మేరీ కమల మాట్లాడుతూ విద్యార్థులు సంస్కారవంతమైన విద్యతో ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలన్నారు. గత ఏడాది ఇంటర్‌లో తమ కళాశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించిందని ప్రిన్సిపాల్ ఎం. విక్రమ్ తెలిపారు. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బి.డి.ఎన్. కుమార్, ఎ.ఓ. డి. ఆనంద్ ప్రసాద్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు.

అనంతరం ఇంటర్ టాపర్లకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ముఖ్య అతిథులు శ్యాంబాబు-కృష్ణవేణి దంపతులను, మేరీ కమలను యాజమాన్యం ఘనంగా సత్కరించింది. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో అధ్యాపకులు పి. రాము, శ్రీనివాసరావు, స్వరూప, ఉషారాణి, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.