BREAKING
నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’ ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన దిశగా భారత్ దూకుడు.. శీతాకాల సమావేశాల్లో ఎంఎస్ఎంఈ, లాజిస్టిక్స్ రంగాలపై తొలి ఇంటిగ్రేటెడ్ ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టనున్న కాగ్ నూతన అడ్వకేట్ బండారి రవికి ఘన సన్మానం... రైతులకు అండగా ఉంటాం మాజీ చైర్మన్ కాంటే కార్ మధుమోహన్ ఆసియాలో టాప్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి గమ్యస్థానంగా అవతరించిన భారత్: 5.5 బిలియన్ డాలర్ల నిధుల ప్రవాహం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: తుది అడ్డంకులపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర స్పందన ఆధునిక నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరోసిటీలో ఘనంగా ‘అవెనీర్–2026’ వార్షిక క్రీడోత్సవం మాక్ గ్రామ సభ నిర్వహించిన చిన్నారులకు బహుమతి అందజేసిన సర్పంచ్, ఉప సర్పంచ్ క్రమశిక్షణ పట్టుదల తో లక్ష్యాలు సాధించాలి నెహ్రూ ఘన నివాళి కౌన్సిలర్లకు ఘన సన్మానం నూతన ఎస్సై తిరుపతిని మర్యాదపూర్వకంగా కలిసిన కొడకండ్ల మండల ప్రెస్ క్లబ్ సభ్యులు విశ్రాంతి గది నిర్మాణానికి రూ 10 లక్షలు విరాళం

రైతులకు అండగా ఉంటాం మాజీ చైర్మన్ కాంటే కార్ మధుమోహన్

Select Suryaa Now
రైతులకు  అండగా ఉంటాం  మాజీ చైర్మన్ కాంటే కార్ మధుమోహన్

 
** మాభూమి మాకే దక్కాలి 
కొంగర ఖుర్దూ రైతుల ఆవేదన
మహేశ్వరం ,(నవంబర్ 14):రైతులకు  అండగా ఉంటామని తుక్కుగూడ మున్సిపాలిటీ
మాజీ చైర్మన్ కాంటే కార్ మధుమోహన్ అన్నారు. జిహెచ్ఎంసి తుక్కుగూడ వార్డులోని రావిరాలలో విలేకరుల సమావేశం నిర్వహించారు .
మున్సిపల్ మాజీ చైర్మన్ మధుమోహన్  
మాజీ కౌన్సిలర్ యాదగిరిరెడ్డి మాట్లాడుతూ.. రైతులకు న్యాయం జరిగే వరకూ వారికి అండగా ఉంటామని మున్సిపల్ మాజీ చైర్మన్ మధుమోహన్ మాజీ కౌన్సిలర్ యాదగిరిరెడ్డి
అన్నారు.పేద రైతులను ఆసరాగా చేసుకుని రైతులకు అండగా నిలవాల్సిన అధికారులు , కబ్జా చేస్తున్న వారికి అండగా నిలుస్తూ రైతులను బెదిరిస్తున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం నాడు ఆర్డీవో కార్యాలయానికి రైతులతో కలిసి వెళ్లి  రైతుల సమస్యను పరిష్కరించే వరకు పోరాటం చేస్తామన్నారు. భూమి అసలైన  రైతులకు న్యాయం చేయకుండా కబ్జా దారులకు  అధికారులు పోలీసులు ఎందుకు మద్దతు తెలుపుతున్నారని ప్రశ్నించారు.  
రావిరాల రెవిన్యూలో పూర్తిగా వందల ఎకరాలు కబ్జా జరుగుతున్న  చేస్తూ వారి పేరు మీద డూప్లికేట్ ఓర్సీలు రిజిస్ట్రేషన్ చేసి వెంచర్లు చేస్తున్న అధికారులు కళ్ళు మూసుకొని చూస్తున్నారా అని వారు ప్రశ్నించారు. అధికారులు పోలీసులు రైతుల ఆవేదన కన్నీటి బాధను అర్థం చేసుకునే పరిస్థితి ఎవరికి కనిపించడం లేదని వారి బాధను ఆసరా చేసుకొని ఉన్న భూమిని కబ్జా చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మహేశ్వరం మండలం రావిర్యాల, కొంగరఖుర్దు- ఏలో  సర్వే నంబర్లు 54,55,56,291, 295, 3504,356, లలోని మాదంటే మాది అంటూ ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.
తమ పూర్వీకుల భూమిని ఫోర్జరీ ఓ ఆర్ సి లు, పహాణీలతో కబ్జా చేస్తున్నారంటూ  మీడియా ముందు కొంగర కుర్ధు ఏ రైతుల ఆవేదనఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. 1977 నాటి ఒరిజినల్ బాండ్ పేపర్, పట్టాదారు పాస్ బుక్ లు, టైటిల్ డీడ్ లను చూపిస్తూ.."ఈ భూమి 48 ఏళ్లుగా మా తాతల కాలం నుండి మా అనుభవంలోనే ఉంది. అన్ని లీగల్ పత్రాలు మా వద్దే ఉన్నాయి. కానీ కొందరు నకిలీ పత్రాలు సృష్టించి, భూ రికార్డులను మాయం చేసి దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తున్నారు అని ఆరోపించారు. ఏం ఆర్ ఓ, ఆర్డిఓ,  కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేదని, రెవెన్యూ ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని పాత రికార్డులను, ప్రస్తుత రికార్డులను పరిశీలించి అసలైన రైతులకు న్యాయం చేయాలని రైతులు ప్రభుత్వాన్ని వేడుకున్నారు. కలెక్టర్ ఆర్డిఓ ఎమ్మార్వో అధికారులు పోలీసులు కబ్జాదారులకు పూర్తిగా సహకరిస్తున్నారని తాతల ముత్తాతల నుండి  భూమిని నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటూ బ్రతుకుతున్న రైతులను మోసం చేసి డూప్లికేట్ పత్రాలు సృష్టించి రైతుల భూమిని కబ్జా చేస్తూ వెంచర్లు చేస్తున్న ఎవరు పట్టించుకోవడంలేదని రైతులు కన్నీటితో వేడుకుంటున్నారు. మాకు న్యాయం జరిగే వరకూ మాభూమి వదిలిపెట్టే ప్రసక్తే లేదని అవసరమైతే ప్రాణాలైనా ఇస్తాం కానీ భూమిని వదిలిపెట్టమని రైతులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బోద యాదగిరి రెడ్డి, రైతులు భూపాల్ రెడ్డి, దానయ్య, తుళ్ళ అనిల్, శివారెడ్డి, కుమ్మరి సత్తయ్య, తుళ్ళ నర్సమ్మ రైతులు తదితరులు పాల్గొన్నారు.
పాల జనార్ధన్, మేజర్ న్యూస్ మహేశ్వరం, రంగారెడ్డి