నూతన అడ్వకేట్ బండారి రవికి ఘన సన్మానం...
సూర్య - పెద్దపల్లి రూరల్ : నూతనంగా అడ్వకేట్‌గా బాధ్యతలు చేపట్టిన బండారి రవిని ఆయన మిత్రులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మిత్రులంతా ఒకచోట చేరి ఆయనకు పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. న్యాయవాద వృత్తిలోకి అడుగుపెట్టడం అభినందనీయమని, తన వృత్తి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. న్యాయవాద వృత్తి ఎంతో బాధ్యతతో కూడుకున్నదని, న్యాయం కోసం వచ్చే బాధితులకు అండగా నిలుస్తూ, న్యాయవ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగించేలా సేవలందించాలని సూచించారు. నూతన బాధ్యతల్లో బండారి రవి మరిన్ని విజయాలు సాధించి మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు. తనను అభినందించి సన్మానించిన మిత్రులకు బండారి రవి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బొల్లు శ్రీనివాస్, ఓడ్నాల రమేష్, దేవనంది సదయ్య, ములక శ్రీనివాస్, ఆవుల లక్ష్మయ్య, సలేంద్ర రవి ఉప్పు సతీష్ లు ఉన్నారు.