న్యాయవాద పరిషత్ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక.
సూర్య - పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా న్యాయవాద పరిషత్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గోదావరిఖనిలోని వి.హెచ్.పి. భవన్‌లో నిర్వహించిన సమావేశాల్లో జిల్లాలోని ఆరు బార్ అసోసియేషన్లకు చెందిన వంద మందికిపైగా న్యాయవాదులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర న్యాయవాద పరిషత్ ప్రధాన కార్యదర్శి సంసాని సునీల్‌కుమార్ ముఖ్యఅతిథిగా, రాష్ట్ర కార్యదర్శులు కొత్తకాపు సుధాకర్‌రెడ్డి, రాగిణి బతుల పాల్గొన్నారు. నూతన కమిటీ అధ్యక్షుడిగా ఆరె మధు (గోదావరిఖని), ప్రధాన కార్యదర్శిగా రాచూరి శ్రీకాంత్ (పెద్దపల్లి), కోశాధికారిగా గుడ్ల వెంకటేష్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా కె.శిరీష (పెద్దపల్లి), కుడిది వెంకటేష్, రాగం శ్రీధర్, జి.భూమయ్య (గోదావరిఖని), కార్యదర్శులుగా ఎస్.అశోక్, పి.రాము, రాజు కార్తీక్, పులిపాక ప్రవీణ్, రామ్ టెంకి శ్రీనివాస్ ఎన్నికయ్యారు. ఆఫీస్ కార్యదర్శిగా గడ్డి సాధన (పెద్దపల్లి), స్టడీ సర్కిల్ కార్యదర్శిగా ఎస్.లావణ్య (గోదావరిఖని), కార్యవర్గ సభ్యుడిగా బర్ల రమేష్ ఎన్నికయ్యారు. న్యాయవాదుల ఐక్యతను పెంపొందించడం, పరిషత్ కార్యక్రమాలను విస్తృతం చేయడం, పేదలకు ఉచిత న్యాయసాయం అందించడం తమ లక్ష్యమని నూతన కమిటీ బాధ్యులు తెలిపారు. ఎన్నికైన వారికి పలువురు న్యాయవాదులు శుభాకాంక్షలు తెలిపారు.