BREAKING
1998 తర్వాత తొలిసారిగా అలాస్కాలో గెలుపొందిన డెమొక్రాటిక్ గవర్నర్ స్పేస్‌ఎక్స్ ఇంటర్నెట్ స్పీడ్ పరిమితులపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్ర ఆగ్రహం జిల్లా ఆసుపత్రిలో డబ్బులు అడిగితే ఫోన్ చేయండి – ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండ శ్రీధర్ నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం న్యాయవాద పరిషత్‌ జిల్లా కమిటీ ఏకగ్రీవ ఎన్నిక. మైక్రోసాఫ్ట్ ప్రపంచవ్యాప్త సేవల అంతరాయంపై ట్రంప్ అధికారి వ్యంగ్యాస్త్రాలు: H-1B వీసా నియామకాలను ప్రస్తావిస్తూ విమర్శ నిరుద్యోగ మహిళలకు భరోసా -ఈ నెల 22న పెద్దపల్లిలో మహిళ ‘మెగా జాబ్ మేళా’ ట్రిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన దిశగా భారత్ దూకుడు.. శీతాకాల సమావేశాల్లో ఎంఎస్ఎంఈ, లాజిస్టిక్స్ రంగాలపై తొలి ఇంటిగ్రేటెడ్ ఆడిట్ నివేదికలను ప్రవేశపెట్టనున్న కాగ్ నూతన అడ్వకేట్ బండారి రవికి ఘన సన్మానం... రైతులకు అండగా ఉంటాం మాజీ చైర్మన్ కాంటే కార్ మధుమోహన్ ఆసియాలో టాప్ రియల్ ఎస్టేట్ పెట్టుబడి గమ్యస్థానంగా అవతరించిన భారత్: 5.5 బిలియన్ డాలర్ల నిధుల ప్రవాహం భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం: తుది అడ్డంకులపై విదేశాంగ మంత్రి జైశంకర్ ఆసక్తికర స్పందన ఆధునిక నవభారత నిర్మాత పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరోసిటీలో ఘనంగా ‘అవెనీర్–2026’ వార్షిక క్రీడోత్సవం

నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం

Select Suryaa Now
నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడలు విజయవంతం

 

కందుకూరు, మేజర్ న్యూస్ (నవంబర్ 14): మై భారత్ రంగారెడ్డి ఆధ్వర్యంలో కందుకూరు మండలం నేదునూరులోని మోడల్ జూనియర్ కళాశాలలో నశా ముక్త్ భారత్ బ్లాక్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించారు. యువత, విద్యార్థుల్లో మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.
ఈ సందర్భంగా వాలీబాల్, కబడ్డీ, షాట్‌పుట్, స్కిప్పింగ్, పరుగు పందెం పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డ్రగ్స్, మద్యం వద్దు – క్రీడామైదానం ముద్దు అనే నినాదంతో యువత మత్తుకు దూరంగా ఉండి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని పిలుపునిచ్చారు.

 

 


కార్యక్రమంలో నేదునూరు ఉపసర్పంచ్ నల్లి శ్రీధర్ ముదిరాజ్, మై భారత్ ప్రతినిధులు శ్రీశైలం యాదవ్, తిక్కల మణికుమార్, మాజీ వాలంటీర్ సామ సురేందర్ రెడ్డి, వార్డు సభ్యుడు ప్రవీణ్ యాదవ్, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుడు శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
టి. శ్రీనివాస్, మేజర్ న్యూస్ కందుకూరు రంగారెడ్డి జిల్లా