BREAKING
ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం

ముగిసిన జాతీయ సదస్సు

Select Suryaa Now
ముగిసిన జాతీయ సదస్సు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో భక్తి ప్రియః శ్రీ జగన్నాథః అనే అంశంపై గత రెండు రోజులుగా జరిగిన జాతీయ సదస్సు శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ వీసీ హరేకృష్ణ శతపథి, విశిష్ట అతిథిగా మాజీ డీన్ ఆఫ్ అకాడమిక్ అఫైర్స్ ప్రొఫెసర్ కొంపెల్ల రామసూర్యనారాయణ విచ్చేసి శ్రీజగన్నాథ స్వామి ప్రత్యేక పూజను నిర్వహించి మాట్లాడుతూ జగద్ ప్రియులు శ్రీ జగన్నాథుడని, ఆ జగన్నాథుని తత్వాన్ని ప్రతి వ్యక్తి తెలుసుకొని ముందుకు సాగాలని సూచించారు. జగన్నాథ సాహిత్యాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేసి భారతీయ సంస్కృతి సంప్రదాయాలు సంరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి రిజిస్ట్రార్ రజనీకాంత్ శుక్లా, హెచ్డీ ప్రొఫెసర్ రాధాగోవింద త్రిపాఠి, సీడీఓఈ డైరెక్టర్ ప్రొఫెసర్ రంగనాథన్, ఉత్కల పీఠం డైరెక్టర్ భరత్ భూషణ్ రథ్, అధ్యాపకులు, విధ్యార్థులు పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్