BREAKING
ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం

బాల్య వివాహాలను అరికడదాం

Select Suryaa Now
బాల్య వివాహాలను అరికడదాం

కొడకండ్ల, మేజర్ న్యూస్, సమాజంలో పెరుగుతున్న బాల్య వివాహాలను అరికట్టి, బాలికల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని కొడకండ్ల గ్రామ సర్పంచ్ దూలం మమత సతీష్ గౌడ్ అన్నారు.

శనివారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ )లో పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశాల మేరకు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన బాల గ్రామసభకు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ బాలికలు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. బాల్య వివాహాల వల్ల బాలికల భవిష్యత్తు దెబ్బతింటుందని, వాటిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే పాఠశాలలో అసంపూర్తిగా ఉన్న నిర్మాణ పనులను స్థానిక ఎమ్మెల్యే సహకారంతో జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడి త్వరితగతిన పూర్తి చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బాల గ్రామసభలో విద్యార్థినులు పలు సమస్యలను ఆమె దృష్టికి తీసుకురాగా, వాటి పరిష్కారానికి అవసరమైన తీర్మానాలు చేసి ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి ఆంజనేయులు, ఉపసర్పంచ్ ఎం.డి. షన్నా, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ జ్యోతి, వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.

రిపోర్టర్ ;నవీన్ , కొడకండ్ల, జనగామ జిల్లా