BREAKING
ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం

ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం

Select Suryaa Now
ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : తిరుపతిలోని ప్రథమ శ్రేణి గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు శనివారం పండుగ వాతావరణంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డాక్టర్ రెడ్డివారి గురువారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై వారోత్సవాలను ప్రారంభించారు. మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి చాక్లెట్లు పంచారు. అనంతరం గ్రంథాలయ వారోత్సవాల ప్రతిజ్ఞ, బ్రోచర్ ఆవిష్కరణ చేశారు.

గ్రంథాలయం అందరికీ దేవాలయాలు…

ఈ సందర్భంగా చైర్మన్ గురువారెడ్డి మాట్లాడుతూ అన్ని మతాలకు దేవుళ్ళు వేరుగా ఉండొచ్చు, కానీ గ్రంథాలయం మాత్రం అందరికీ ఉపయోగపడే దేవాలయం అన్నారు. విద్యార్థి దశ నుండే పుస్తక పఠనం అలవాటు చేసుకోవాలి. సరస్వతీ నిలయాలైన గ్రంథాలయాలను వినియోగించుకుని మేధాశక్తిని పెంచుకోవాలని సూచించారు. 

కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, విద్యా మంత్రి నారా లోకేష్ సారథ్యంలో గ్రంథాలయాలకు అన్ని వసతులు కల్పిస్తున్నామన్నారు. 14 నుండి 20వ తేదీ వరకు చిత్రలేఖనం, వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేస్తామన్నారు. పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు కూడా అందుబాటులో ఉన్నాయని, అభ్యర్థులు సద్వినియోగం చేసుకుని ఉద్యోగ అవకాశాలు పొందాలన్నారు. పుస్తక పఠనం మెదడుకు వ్యాయామం లాంటిదని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ప్రాంతీయ గ్రంథాలయ అధికారి ధనంజయులు, తిరుపతి బాలోత్సవ అధ్యక్షులు నడ్డి నారాయణ, రిటైర్డ్ ప్రొఫెసర్ బి.గోపాల్, ప్రముఖ గాయకులు సోము ఉమాపతి, రీడర్లు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్