BREAKING
ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి తెలంగాణ ఉద్యమకారులకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలి నిరుపేద నాయీ బ్రాహ్మణులకు ఇంటి స్థలాలు ఇప్పించండి నాయీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ కి వినతి కార్పొరేటర్ నాగభూషణం దంపతులకు సన్మానం 19 న రూరల్ కో ఆప్షన్ మెంబర్ ఎన్నిక అదే రోజు న ఎంపీపీ, వైస్ ఎంపీపీ ల ఎన్నిక శ్రీనివాసపురంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. – వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ లావణ్య .మల్లవరంలో జెడ్పీటీసీ హర్షిత్‌రెడ్డికి పౌరసన్మానం! 450 ఓట్ల మెజారిటీ అందించిన గ్రామానికి రుణపడి ఉంటా – తుమ్మలగుంటతో సమానంగా సి.మల్లవరాన్ని అభివృద్ధి చేస్తా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఘాట్ రోడ్డులో యథావిధిగా వాహనాల రాకపోకలు

వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు

Select Suryaa Now
వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : కరకంబాడి రోడ్డులోని ఎస్.వి.కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ లో వికసిత్ భారత్ లక్ష్యంగా యువ నాయకుల సంభాషణ-2027 మూడవ విడత పోటీ కార్యక్రమం శనివారం విజయవంతంగా నిర్వహించారు. యువజన సర్వీసుల శాఖ, సెట్విన్ తిరుపతి, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ఎస్విసిఈ సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సెట్విన్ సీఈవో డా.పి.యశ్వంత్, మేనేజర్ కె.మోహన్ కుమార్ జిల్లా యువజన అధికారి మై భారత్ పి.శశికుమార్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆర్ లోకనాథం, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె చంద్రశేఖర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి చిత్తూరు, తిరుపతి జిల్లాల నుండి విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వికసిత్ భారత్ - 2047 లక్ష్య సాధనకు తమ నూతన ఆవిష్కరణలు, ఆలోచనలు, నాయకత్వ లక్షణాలను ప్రదర్శించారు. మూడవ విడతలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులు, బృందాలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ - దేశాభివృద్ధిలో యువత నాయకత్వం, నైపుణ్యాభివృద్ధి, నూతన ఆవిష్కరణల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమం విద్యార్థుల్లో సృజనాత్మకత, దేశ నిర్మాణంలో భాగస్వామ్య స్ఫూర్తిని పెంపొందించిందని పేర్కొన్నారు.

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్