సిద్దిపేట సభ ఏర్పాట్ల సమావేశంలో కాట శ్రీనివాస్‌గౌడ్
పటాన్‌చెరు:ఈ నెల 19న సిద్దిపేటలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్న బహిరంగ సభ ఏర్పాట్లపై హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ కాట శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్ వెంకటస్వామి, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్‌రెడ్డితో కలిసి సభ ఏర్పాట్లు, నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యం తదితర అంశాలపై చర్చించారు.