BREAKING
పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపు చేయాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి నేడు ప్రజావాణి కార్యక్రమం విప్పమనుపట్టెడ సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రామస్థుడి ఫిర్యాదు అమెరికాలో మూడో రోజు కొనసాగుతున్న విమాన ప్రయాణాల అంతరాయం విజ్ఞాన సమాజమే దేశ అభివృద్ధికి పునాది రష్యా కుట్రల నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి సరిహద్దులను మూసివేయనున్న ఎస్టోనియా 16న పిల్లల ప్రజావాణి సింగపూర్, మలేషియా దేశాలకు క్షమాపణలు తెలిపిన ఇండోనేషియా అధ్యక్షుడు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులుగా గూట్ల తిరుపతి హూతీ వ్యతిరేక బలగాల వెనుకంజ, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడుల కలకలం అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ. మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన ఇనగాల మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర

రిటర్నింగ్‌ అధికారులకు ఆన్‌లైన్‌ ప్రక్రియపై అవగాహన

Select Suryaa Now
రిటర్నింగ్‌ అధికారులకు ఆన్‌లైన్‌ ప్రక్రియపై అవగాహన

కె గంగవరం, మేజర్ న్యూస్ :స్థానిక పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా స్టేజ్‌–1 రిటర్నింగ్‌ అధికారులకు ఆన్‌లైన్‌ ప్రక్రియపై రాష్ట్రస్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు.మండలంలోని 26 గ్రామాలకు సంబంధించి ఎన్నికల విధులు నిర్వహించనున్న అధికారులకు ఈ శిక్షణ ఇచ్చారు.రిటర్నింగ్‌ అధికారులు తమ వ్యక్తిగత లాగిన్‌ ద్వారా ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడం,అవసరమైన సమాచారాన్ని అప్‌లోడ్‌ చేయడం,సంబంధిత ప్రక్రియలను పూర్తి చేయడంపై సవివరంగా అవగాహన కల్పించారు.ఎన్నికల విధుల్లో భాగంగా ప్రతి అధికారి తమకు కేటాయించిన లాగిన్‌ను ఉపయోగించి వివరాలను స్వయంగా నమోదు చేయాలని,నిర్దేశిత మార్గదర్శకాలను పాటిస్తూ ఎలాంటి తప్పిదాలకు తావులేకుండా ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు.కార్యక్రమంలో ఎంపీడీవో ఎన్‌.శ్రీనివాస్‌,సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఆఫ్‌ పోలీస్‌ జి.సోమేంద్ర, హెల్ప్‌డెస్క్‌ మాస్టర్‌ ట్రైనర్‌ జి.వి.సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.తొమ్మిది క్లస్టర్లకు చెందిన రిటర్నింగ్‌ అధికారులు శిక్షణకు హాజరై ఆన్‌లైన్‌ విధానంపై అవగాహన పొందారు.ఈ శిక్షణ ఎన్నికల విధుల నిర్వహణకు ఎంతగానో దోహదపడుతుందని అధికారులు తెలిపారు.