BREAKING
పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపు చేయాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి నేడు ప్రజావాణి కార్యక్రమం విప్పమనుపట్టెడ సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రామస్థుడి ఫిర్యాదు అమెరికాలో మూడో రోజు కొనసాగుతున్న విమాన ప్రయాణాల అంతరాయం విజ్ఞాన సమాజమే దేశ అభివృద్ధికి పునాది రష్యా కుట్రల నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి సరిహద్దులను మూసివేయనున్న ఎస్టోనియా 16న పిల్లల ప్రజావాణి సింగపూర్, మలేషియా దేశాలకు క్షమాపణలు తెలిపిన ఇండోనేషియా అధ్యక్షుడు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులుగా గూట్ల తిరుపతి హూతీ వ్యతిరేక బలగాల వెనుకంజ, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడుల కలకలం అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ. మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన ఇనగాల మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర

విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

Select Suryaa Now
విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

. రాయవరం, మేజర్ న్యూస్. రాయవరంలోని విజ్ఞాన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాయవరం అభివృద్ధి కమిటీ చైర్మన్, టీడీపీ సీనియర్ నాయకులు ఉండవెల్లి రాంబాబు విద్యార్థి ఎన్నికల్లో విజయం సాధించిన బాల నాయకులకు బ్యాడ్జీలు అందజేశారు. చిన్నతనం నుంచే విద్యార్థులకు ప్రజాస్వామ్య విలువలు, నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు.విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్‌పర్సన్ డాక్టర్ మల్లిడి శేషవేణి మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని సూచించారు. అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ మల్లిడి అమ్మిరెడ్డి మాట్లాడుతూ చదువుతో పాటు క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని తెలిపారు.ఈ సందర్భంగా ఇండోర్, అవుట్‌డోర్ క్రీడలు, డ్రాయింగ్, చెస్ తదితర పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ వి. నవీన్ కుమార్, కళాశాల ప్రిన్సిపాళ్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. చిన్నారుల ఆటపాటలు, సందడితో వేడుకలు ఆనందంగా ముగిశాయి.