BREAKING
రాష్ట్రస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్‌కు ఏడు ప్రాజెక్టుల ఎంపిక అనపర్తి సర్పంచ్ బరిలో వీరన్నబాబు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి. జెన్‌జీ తరానికి అనన్య పాండే మద్దతు.. ఊరికే అపవాదు మోస్తున్నారంటూ హెచ్‌టీఎల్ఎస్ 2026లో వ్యాఖ్యలు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించాలి అధికారుల సమన్వయం, అంకితభావం అభినందనీయం :రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆతిథ్య నిర్వహణలో భేష్.. విక్టరీ లో బాలలు దినోత్సవం. బాలీవుడ్ నటులపై బెదిరింపులు, భద్రతా ఆందోళనలు భయానకంగా ఉన్నాయన్న అనన్య పాండే నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ప్రజల ఆశీస్సులే మాకు కొండంత బలం. కోటిపల్లి రేవు దాటేదెట్లా భక్తుల అవస్థ పలాసలో ఘనంగా బాలల దినోత్సవం. ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు తాను దురాశ కలిగిన నటినంటూ అనన్య పాండే ఆసక్తికర వ్యాఖ్యలు.. మైథాలజీ జానర్‌పై ఆసక్తి

బాలల దినోత్సవ వేడుకల్లో నెహ్రూకు ఘన నివాళి

Select Suryaa Now
బాలల దినోత్సవ వేడుకల్లో నెహ్రూకు ఘన నివాళి

కడియం, మేజర్ న్యూస్ :కడియం మండలం బుర్రిలంక గ్రామంలో కాంగ్రెస్ కార్యాలయంలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ 137 జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ రూరల్ కోఆర్డినేటర్ తాడాల కొండరాజు నెహ్రూ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. పిల్లలంటే నెహ్రూకు ఎంతో ఇష్టమని, అందుకే ఆయన జయంతిని దేశవ్యాప్తంగా బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నామని తెలిపారు. బాలలే దేశ భవిష్యత్తు అని, ప్రతి చిన్నారికి నాణ్యమైన విద్య, మెరుగైన ఆరోగ్యం, సమాన అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు. పిల్లల ప్రతిభను ప్రోత్సహిస్తూ, వారి ఉజ్వల భవిష్యత్తుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. నేటి బాలలే రేపటి పౌరులంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కడియం మండల కాంగ్రెస్ అధ్యక్షులు పిఎస్ఎన్ రాజు తీగిరెడ్డి నాగబాబు తీగి రెడ్డి ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.