BREAKING
.మల్లవరంలో జెడ్పీటీసీ హర్షిత్‌రెడ్డికి పౌరసన్మానం! 450 ఓట్ల మెజారిటీ అందించిన గ్రామానికి రుణపడి ఉంటా – తుమ్మలగుంటతో సమానంగా సి.మల్లవరాన్ని అభివృద్ధి చేస్తా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఘాట్ రోడ్డులో యథావిధిగా వాహనాల రాకపోకలు నినాదాలు కాదు..పిల్లల వర్తమానానికి భరోసా కావాలి! శ్రీ జ్ఞాన జ్యోతి పాఠశాలలో అంబరాన్నంటిన బాలల దినోత్సవ వేడుకలు! ఎల్.ఆర్.జి పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బాలోత్సవం, వార్షికోత్సవం పద్మనాభపురం కాలనీలో చైర్మన్ గంగాభవాని పర్యటన. మధుమేహంపై ప్రతి ఒక్కరూ అవగాహన అవసరం.. జగన్, ఆయన కుటుంబంపై సైబర్ దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి పాత పింఛను విధానానికి దరఖాస్తుల ఆహ్వానం.... గురుకులాల్లో ఘనంగా బాలల దినోత్సవం.. ‘ బాక్సాఫీస్ వద్ద రామాయణ సునామీ.. పది రోజుల్లోనే ₹670 కోట్ల మార్క్ దాటిన రణ్‌బీర్ కపూర్, యశ్ చిత్రం రాష్ట్రస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్‌కు ఏడు ప్రాజెక్టుల ఎంపిక అనపర్తి సర్పంచ్ బరిలో వీరన్నబాబు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి.

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి.

Select Suryaa Now
పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి.

 

బొడ్డపాడులో పోలీసుల అవగాహన కార్యక్రమం - గొడవలకు పాల్పడితే కఠిన చర్యలు.

కాశీబుగ్గ ఎస్ హెచ్ఓ ఎం అప్పారావు.

పలాస, నవంబర్ 14,మేజర్ న్యూస్.

పలాస మండలంలో రాబోయే పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోంది.ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ ఎం అప్పారావు బొడ్డపాడు గ్రామ పంచాయతీని సందర్శించారు. గ్రామంలోని ఇరు రాజకీయ పార్టీల ముఖ్య నాయకులు, పెద్దలు, ప్రజలతో సమావేశమై ఎన్నికల నిర్వహణపై చర్చించారు.

ఎస్‌హెచ్‌ఓ సూచనలు.

ఎన్నికల సమయంలో గ్రామంలో గొడవలు, ఘర్షణలు, వివాదాలు చోటుచేసుకోకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి.నాయకులు, కార్యకర్తలు పరస్పర గౌరవంతో మెలగాలి, కక్ష సాధింపు ధోరణి ప్రదర్శించకూడదు.ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడం, బెదిరింపులకు పాల్పడటం, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు దూరంగా ఉండాలి.ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలి.శాంతిభద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలు చేసినా, గొడవలు సృష్టించినా, చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌హెచ్‌ఓ స్పష్టం చేశారు.గ్రామ పెద్దలు, యువత, ప్రజాప్రతినిధులు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసులకు సహకరించాలని కోరారు. ఏవైనా సమస్యలు తలెత్తితే చట్టపరమైన మార్గాల్లోనే పరిష్కరించుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో ఇరు పార్టీల నాయకులు, గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.