కోటిపల్లి రేవు దాటేదెట్లా భక్తుల అవస్థ
అయినవిల్లి మేజర్ న్యూస్ :రెండు జిల్లాల మధ్య అడ్డంగా ప్రధాన మార్గం విడదీసే గౌతమి గోదావరి పాయ కోటిపల్లి రేవు దశాబ్దాలు గడిచిన నెరవేరని వాగ్దానాలు కోటిపల్లి వంతెన. అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరం ఒకవైపు మరోవైపు కపిలేశ్వరం మండలం కోటిపల్లి కోటిపల్లి రేవుకు రాకపోకలు పునరుద్ధరించకపోవడంతో ప్రయాణికులు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కపిలేశ్వర మండలం అయినవిల్లి మండలం మధ్య గోదావరి గౌతమీపాయ కోటిపల్లి వద్ద ప్రవహిస్తూ యానం దగ్గర సముద్రంలో కలుస్తుంది .ప్రతి సంవత్సరం వచ్చే వరదలకు రేవు మధ్యలో మేటలు కొట్టు పోయి మార్గం దెబ్బతింటుంది. గతంలో వరదలు వెళ్లిన వెంటనే ఈ మార్గాన్ని పునరుద్ధరించేవారు. ప్రస్తుతం నవంబర్ నెల చివరి దశకు చేరినా ఇంతవరకు ఈ మార్గంపై రేవు దాటింపుకు ఎటువంటి మరమ్మత్తులు తీసుకోలేదు కాకినాడ అమలాపురం రేవు దాటి ఈమార్గం ద్వారా వెళ్లేవారు అటు యానం గానీ ఇటు రావులపాలెం గాని బ్రిడ్జిలు దాటి చుట్టి తిరిగి వెళ్ళవలసి వస్తుంది నిత్యం వందలాదిగా కూలీలు రేవు దాటి అటువైపు నుంచి ఇటువైపు ఇటువైపు నుంచి అటువైపుకి ఉపాధి కోసం తరలి వచ్చేవారు కార్తీక మాసం సందర్భంగా అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామిని దర్శించుకుని కోటిపల్లి సోమేశ్వర స్వామిని మరియు ద్రాక్షారామ భీమేశ్వర స్వామిని దర్శించుకునేవారు. అప్పట్లో ప్రయాణం సాగించేవారు అయితే ప్రస్తుతం ఏ విధమైన రాకపోకలు లేక ప్రయాణాలు నిలిచిపోయాయి రేవు మధ్యలో రోడ్డు కొట్టుకుపోవడంతో అసలు రేవుకు మార్గమే లేదు ఈ రేవు పునరుద్ధరించడం పై ఇంత వరకు ప్రభుత్వం స్పందన లేకపోవడం భక్తుల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. రేవుకు వంతెన నిర్మించడం లేదు గాని సకాలంలో రేవు దాటే సౌకర్యం కూడా కల్పించలేకపోవటం జిల్లా యంత్రాంగం పై విమర్శలు వస్తున్నాయి. వరద సమయంలో రోడ్డు మార్గం కొట్టు పోయి రేవు రెండు పాయలుగా విడిపోతుంది . ఒక 200 మీటర్ల మేర ముక్తేశ్వరం వైపు రేవుకు తురలు పెట్టి రోడ్డు మార్గాన్ని నిర్మిస్తారు కోటిపల్లి వైపు పంటి ద్వారా దాటడంతో రేవు రాకపోకలు జరుగుతుంటాయి . అమలాపురం నుండి కాకినాడ యాభై కిలోమీటర్ల దూరం ఉంటుంది. ప్రయాణికులు ఈ రేవు దాటి ప్రయాణించడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఇది గాక కార్తీక్ మాసం సందర్భంగా పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. గౌతమి గోదావరిలో స్నానాలు ఆచరించి అటు సోమేశ్వర స్వామిని ముక్తేశ్వరం వైపు ముక్తేశ్వర స్వామిని అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి దర్శించుకుంటారు. ఈ సౌకర్యం లేక చుట్టూ తిరిగి రావలసి వస్తుంది పంటి దాటింపుకు చర్యలు తీసుకోవాలని అటు భక్తులు ఇటు ప్రయాణికులు కోరుతున్నారు.