BREAKING
శ్రీనివాసపురంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. – వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ లావణ్య .మల్లవరంలో జెడ్పీటీసీ హర్షిత్‌రెడ్డికి పౌరసన్మానం! 450 ఓట్ల మెజారిటీ అందించిన గ్రామానికి రుణపడి ఉంటా – తుమ్మలగుంటతో సమానంగా సి.మల్లవరాన్ని అభివృద్ధి చేస్తా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఘాట్ రోడ్డులో యథావిధిగా వాహనాల రాకపోకలు నినాదాలు కాదు..పిల్లల వర్తమానానికి భరోసా కావాలి! శ్రీ జ్ఞాన జ్యోతి పాఠశాలలో అంబరాన్నంటిన బాలల దినోత్సవ వేడుకలు! ఎల్.ఆర్.జి పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బాలోత్సవం, వార్షికోత్సవం పద్మనాభపురం కాలనీలో చైర్మన్ గంగాభవాని పర్యటన. మధుమేహంపై ప్రతి ఒక్కరూ అవగాహన అవసరం.. జగన్, ఆయన కుటుంబంపై సైబర్ దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి పాత పింఛను విధానానికి దరఖాస్తుల ఆహ్వానం.... గురుకులాల్లో ఘనంగా బాలల దినోత్సవం.. ‘ బాక్సాఫీస్ వద్ద రామాయణ సునామీ.. పది రోజుల్లోనే ₹670 కోట్ల మార్క్ దాటిన రణ్‌బీర్ కపూర్, యశ్ చిత్రం రాష్ట్రస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్‌కు ఏడు ప్రాజెక్టుల ఎంపిక అనపర్తి సర్పంచ్ బరిలో వీరన్నబాబు.

కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించాలి

Select Suryaa Now
కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించాలి

 కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు.

- శ్రీకాకుళం నగరంలోని ప్రతి వార్డును అభివృద్ధి చేసి, కార్పొరేషన్‌కు మహర్దశ తీసుకొస్తాం

- వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన 400 మంది కార్యకర్తలకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం
శ్రీకాకుళం
నవంబర్14 మేజర్ న్యూస్ : 16 ఏళ్ల తర్వాత జరుగుతున్న శ్రీకాకుళం నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలు కేవలం సాధారణ ఎన్నికలు కాదని, నగర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని పేర్కొన్నారు. ప్రతి వార్డులోనూ అఖండ మెజారిటీతో కూటమి అభ్యర్థులను గెలిపించుకోవాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.

శనివారం శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పలువురు కీలక నాయకులతో కలిసి సుమారు 400 మంది కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు మొదలవలస రమేష్ తదితరులు నూతనంగా పార్టీలో చేరిన వారికి తెలుగుదేశం పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీపై అభిమానంతో, పార్టీ బలోపేతానికి, శ్రీకాకుళం నగర అభివృద్ధికి మరింత బలం చేకూర్చాలనే సంకల్పంతో పార్టీలోకి వస్తున్న ప్రతి ఒక్కరికీ స్వాగతం పలుకుతున్నామని తెలిపారు. 16 ఏళ్ల తర్వాత ఇలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవడం శుభసూచకమని పేర్కొన్నారు. గురుగుబెల్లి లోకనాథం, పైడి రాజారావు, చౌదరి పురుషోత్తం నాయుడు, చౌదరి సతీష్ వంటి నాయకులు తెలుగుదేశం పార్టీ వైపు రావడం మంచి పరిణామమని, అందరం కలిసికట్టుగా నగర అభివృద్ధికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు.

- కార్యకర్తల కష్టానికి తగిన గౌరవం

తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడిన ప్రతి కార్యకర్తకు తగిన గుర్తింపు, గౌరవం కల్పించాలన్నదే తమ లక్ష్యమని, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తకు గౌరవం కోసం ప్రయత్నించామని మంత్రి స్పష్టం చేశారు. ఈ దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మాట్లాడి, కోర్టులకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి కూడా కృషి చేశామని తెలిపారు.

- శ్రీకాకుళం అభివృద్ధికి ఇదే సరైన సమయం

విశాఖపట్నం, విజయవాడ నగరాలు అద్భుతంగా అభివృద్ధి చెందాయని, అదే స్థాయిలో మన శ్రీకాకుళం నగరం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందలేదన్న బాధ తనతో పాటు మంత్రి అచ్చెన్నాయుడికి కూడా ఉందని రామ్మోహన్ నాయుడు అన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు ఒక ఎత్తయితే, శ్రీకాకుళం కార్పొరేషన్ మరో ఎత్తు అని పేర్కొన్నారు. నగరంలోని ప్రతి వార్డుపై ప్రత్యేక దృష్టి సారించి, గతంలో ఎన్నడూ చూడని రీతిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు.

గతంలో పెద్దపాడు రహదారిని ఎవరూ విస్తరించలేరనే అభిప్రాయం ఉండేదని, ఎమ్మెల్యే గొండు శంకర్ అందరినీ సమన్వయం చేసుకుంటూ ఆ పనిని సుసాధ్యం చేశారని ప్రశంసించారు. ఒక సాధారణ ఎమ్మెల్యే అనుకున్న గొండు శంకర్ తనలోని అసాధారణ కార్యదక్షతను నిరూపించుకున్నారని కొనియాడారు. ప్రస్తుతం నగరంలో కనిపిస్తున్న అభివృద్ధి అందుకు నిదర్శనమని అన్నారు.

- అరసవల్లి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం

శ్రీకాకుళం ప్రజల అదృష్టంగా భావించే అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయానికి దేశవిదేశాల నుంచి భక్తులు వస్తున్నారని, అయితే వారికి అవసరమైన సదుపాయాలు మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉందని మంత్రి తెలిపారు. మంత్రి అచ్చెన్నాయుడితో కలిసి ప్రత్యేక దృష్టి సారించి, కేంద్ర ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చి ఆలయ అభివృద్ధికి కృషి చేశామని వివరించారు.

- కూటమి ఐక్యతే విజయానికి బలం

శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికలు కురుక్షేత్రంలో కూటమి విజయం దేశ రాజకీయ చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలని రామ్మోహన్ నాయుడు ఆకాంక్షించారు. 16 ఏళ్ల క్రితం ఉన్న రాజకీయ పరిస్థితులు ఇప్పుడు లేవని, ప్రజల మద్దతుతో కూటమి మరింత బలంగా ఉందని అన్నారు. అందరూ సమన్వయంతో కలిసికట్టుగా పనిచేస్తే ప్రత్యర్థులు ఎదురునిలవలేరని స్పష్టం చేశారు.

మేయర్ అభ్యర్థి విషయంలో ఎన్డీయే పెద్దలు ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి అనుగుణంగా అందరం కలిసి ముందుకు సాగాలని సూచించారు. గతంలో కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు మించి మరిన్ని కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు.

శ్రీకాకుళం కార్పొరేషన్ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తున్న రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడికి ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అందరి సమష్టి కృషితో శ్రీకాకుళం నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.