BREAKING
పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపు చేయాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి నేడు ప్రజావాణి కార్యక్రమం విప్పమనుపట్టెడ సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రామస్థుడి ఫిర్యాదు అమెరికాలో మూడో రోజు కొనసాగుతున్న విమాన ప్రయాణాల అంతరాయం విజ్ఞాన సమాజమే దేశ అభివృద్ధికి పునాది రష్యా కుట్రల నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి సరిహద్దులను మూసివేయనున్న ఎస్టోనియా 16న పిల్లల ప్రజావాణి సింగపూర్, మలేషియా దేశాలకు క్షమాపణలు తెలిపిన ఇండోనేషియా అధ్యక్షుడు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులుగా గూట్ల తిరుపతి హూతీ వ్యతిరేక బలగాల వెనుకంజ, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడుల కలకలం అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ. మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన ఇనగాల మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర

ఆతిథ్య నిర్వహణలో భేష్..

Select Suryaa Now
ఆతిథ్య నిర్వహణలో భేష్..


- జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్‌కు సీఎం పురస్కారం!

* సీఐఐ సదస్సులో వేలాది మంది అతిథులకు లోటుపాట్లు లేని విందు ఏర్పాట్లు

* ఆంధ్రా రుచులకు ఫిదా అయిన విదేశీ దౌత్యవేత్తల ప్రశంసల జల్లు

* ప్రతిభను గుర్తించి అవార్డుతో సత్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు


శ్రీకాకుళం నవంబర్ 14 మేజర్ న్యూస్:
ప్రతిష్టాత్మక సీఐఐ భాగస్వామ్య సదస్సుకు తరలివచ్చిన వేలాది మంది జాతీయ, అంతర్జాతీయ అతిథులకు ఆతిథ్యం అందించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా అభినందించి, అవార్డుతో సత్కరించారు.
సదస్సు ప్రాంగణంలో వివిధ దేశాల నుంచి విచ్చేసిన దౌత్యవేత్తలు, పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులకు భోజనాల విషయంలో ఎక్కడా ఏ చిన్న అసౌకర్యం తలెత్తకుండా, ఒక్క విమర్శకూ తావులేకుండా ఆయన పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మన సంప్రదాయ ఆంధ్రా వంటకాలను ఎంతో రుచికరంగా, నాణ్యతతో అందించడంతో చాలామంది విదేశీ దౌత్యవేత్తలు, అతిథులు విందు అద్భుతంగా ఉందంటూ ప్రశంసలు కురిపించారు. మన ఆతిథ్య వైభవాన్ని ప్రపంచ దేశాల ప్రతినిధులకు పరిచయం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.
సమయస్ఫూర్తితో, సమర్థవంతమైన ప్రణాళికతో విందు ఏర్పాట్లను పర్యవేక్షించిన జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ సేవలను గుర్తించిన ప్రభుత్వం ఆయనకు ఈ పురస్కారాన్ని అందించింది. జాతీయ స్థాయి సదస్సులో శ్రీకాకుళం జిల్లా అధికార యంత్రాంగం కీర్తిని ఇనుమడింపజేస్తూ సీఎం చేతులమీదుగా అవార్డు అందుకున్న జాయింట్ కలెక్టర్‌కు సహచర అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు.