ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
సంతబొమ్మాళి, నవంబర్ 14, మేజర్ న్యూస్ :
మండలంలో జగన్నాధపురం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో జాతీయ బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు లోపలికి జయకృష్ణారెడ్డి పాఠశాల ఆవరణలో పండిట్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, బాలలదినోత్సవ ప్రాధాన్యతను వివరిస్తూ స్వతంత్ర భారతదేశ తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూకి బాలలంటే ఎంతో మక్కువ అని నెహ్రూజీ మరణానంతరం, పిల్లల పట్ల ఆయనకున్న మక్కువ మరియు వారి అభివృద్ధికి గౌరవంగా ఆయన జన్మదినం నవంబర్ 14న బాలలదినోత్సవాన్ని జరుపుకోవాలని పార్లమెంటులో తీర్మానం చేశారని తెలిపారు. ఈనాటి బాలలే రేపటి పౌరులని బాలల భవిష్యత్ పైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉందని తెలిపారు. విద్యార్థులకు ఐడెంటి కార్డ్స్, టై లు, కొత్త సేమ్ 2 పుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు వివేకానంద శతపతి 2000 రూపాయలు ఇచ్చి కార్యక్రమం అయ్యేలా ప్రోత్సహించారు. ఆయనకు పాఠశాల తరుపున విద్యా కమిటీ కృతజ్ఞతలు తెలిపారు.