BREAKING
.మల్లవరంలో జెడ్పీటీసీ హర్షిత్‌రెడ్డికి పౌరసన్మానం! 450 ఓట్ల మెజారిటీ అందించిన గ్రామానికి రుణపడి ఉంటా – తుమ్మలగుంటతో సమానంగా సి.మల్లవరాన్ని అభివృద్ధి చేస్తా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఘాట్ రోడ్డులో యథావిధిగా వాహనాల రాకపోకలు నినాదాలు కాదు..పిల్లల వర్తమానానికి భరోసా కావాలి! శ్రీ జ్ఞాన జ్యోతి పాఠశాలలో అంబరాన్నంటిన బాలల దినోత్సవ వేడుకలు! ఎల్.ఆర్.జి పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బాలోత్సవం, వార్షికోత్సవం పద్మనాభపురం కాలనీలో చైర్మన్ గంగాభవాని పర్యటన. మధుమేహంపై ప్రతి ఒక్కరూ అవగాహన అవసరం.. జగన్, ఆయన కుటుంబంపై సైబర్ దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి పాత పింఛను విధానానికి దరఖాస్తుల ఆహ్వానం.... గురుకులాల్లో ఘనంగా బాలల దినోత్సవం.. ‘ బాక్సాఫీస్ వద్ద రామాయణ సునామీ.. పది రోజుల్లోనే ₹670 కోట్ల మార్క్ దాటిన రణ్‌బీర్ కపూర్, యశ్ చిత్రం రాష్ట్రస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్‌కు ఏడు ప్రాజెక్టుల ఎంపిక అనపర్తి సర్పంచ్ బరిలో వీరన్నబాబు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి.

పలాసలో ఘనంగా బాలల దినోత్సవం.

Select Suryaa Now
పలాసలో ఘనంగా బాలల దినోత్సవం.

 

బాలసదనం బాలికలకు పెన్సిల్స్, మిఠాయిల పంపిణీ - విద్యార్థులకు న్యాయ విజ్ఞాన సదస్సు.

పలాస, నవంబర్ 14, మేజర్ న్యూస్.

బాలల దినోత్సవం పురస్కరించుకొని అధ్యక్షులు,మండల న్యాయ సేవా సంఘము మరియు జూనియర్ సివిల్ జడ్జి డివిజన్,పలాస వారి ఆదేశాల మేరకు ప్యానల్ అడ్వకేట్స్ ఆధ్వర్యంలో శనివారం ఘనంగా బాలల దినోత్సవం నిర్వహించారు.అందులో భాగంగా స్థానిక బాలసదనంలో ఉన్న బాలికలకు పెన్సిల్స్, స్కేల్, ఎరేజర్ మరియు మిఠాయిలను పంచిపెట్టారు.అనంతరం కాశీబుగ్గ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రత్యేక న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ విద్యార్థులకు..బాలలపై అత్యాచార నిరోధక చట్టం (పోక్సో)బాల్యవివాహ నిషేధ చట్టం,మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిషేధం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. సమాజంలో ప్రతి ఒక్కరూ పిల్లలు బాగా చదువుకుని, సమాజ అభివృద్ధికి పాటుపడేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో ప్యానల్ అడ్వకేట్స్ బీకేఆర్ పట్నాయక్, జీఎంఎస్ అనిల్ రాజు, కె. లోకేశ్వరరావు, పెంట రత్నాకర్, ఎంఈఓ సీహెచ్. శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయులు చిన్నమ్మనాయుడు,ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.