BREAKING
అనపర్తి సర్పంచ్ బరిలో వీరన్నబాబు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి. జెన్‌జీ తరానికి అనన్య పాండే మద్దతు.. ఊరికే అపవాదు మోస్తున్నారంటూ హెచ్‌టీఎల్ఎస్ 2026లో వ్యాఖ్యలు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించాలి అధికారుల సమన్వయం, అంకితభావం అభినందనీయం :రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆతిథ్య నిర్వహణలో భేష్.. విక్టరీ లో బాలలు దినోత్సవం. బాలీవుడ్ నటులపై బెదిరింపులు, భద్రతా ఆందోళనలు భయానకంగా ఉన్నాయన్న అనన్య పాండే నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ప్రజల ఆశీస్సులే మాకు కొండంత బలం. కోటిపల్లి రేవు దాటేదెట్లా భక్తుల అవస్థ పలాసలో ఘనంగా బాలల దినోత్సవం. ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు తాను దురాశ కలిగిన నటినంటూ అనన్య పాండే ఆసక్తికర వ్యాఖ్యలు.. మైథాలజీ జానర్‌పై ఆసక్తి ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి

జాతీయ స్థాయి పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థినుల ప్రతిభ..

Select Suryaa Now
జాతీయ స్థాయి పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థినుల ప్రతిభ..


- రెండు విభాగాల్లోనూ ప్రథమ బహుమతులు కైవసం..
-  పాఠశాలకు గర్వకారణంగా నిలిచిన బాలికలు

నరసన్నపేట, నవంబర్ 14 మేజర్ న్యూస్ :
జాతీయ స్థాయి ఆన్‌లైన్ పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో పోలాకి మండలం ఈదులవలస పీఎం శ్రీ ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థినులు అసాధారణ ప్రతిభ కనబరిచి రెండు విభాగాల్లోనూ ప్రథమ బహుమతులు సాధించారు. తమ సృజనాత్మక ఆలోచనలు, కళాత్మక నైపుణ్యంతో జాతీయ స్థాయిలో సత్తా చాటి పాఠశాలకు కీర్తి ప్రతిష్ఠలు తీసుకొచ్చారు.

గుంటూరుకు చెందిన యోగద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 'యువ భారతం – ప్రగతిశీల భారతం (Young India – Progressive India)' అనే ఇతివృత్తంతో నిర్వహించిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో సీనియర్ విభాగంలో 9వ తరగతి విద్యార్థిని సీహెచ్. శ్రీవల్లి, జూనియర్ విభాగంలో 7వ తరగతి విద్యార్థిని సీహెచ్. కృషిత ప్రథమ బహుమతులు సాధించి తమ ప్రతిభను చాటుకున్నారు.

చిన్న వయసులోనే జాతీయ స్థాయి పోటీల్లో విజయం సాధించడం పట్ల పాఠశాల ప్రిన్సిపాల్ పి. ప్రవీణ, ఉపాధ్యాయ బృందం హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి పోటీలు ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు. విద్యార్థినుల విజయాలు పాఠశాలకు గర్వకారణమని కొనియాడుతూ వారికి అభినందనలు తెలిపారు.

అదేవిధంగా విద్యార్థినులకు సరైన మార్గదర్శకత్వం అందించి, ఈ విజయానికి తోడ్పడిన ఉపాధ్యాయుడు జె. కృష్ణారావును ప్రిన్సిపాల్‌తో పాటు ఉపాధ్యాయులందరూ ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థినుల ప్రతిభకు లభించిన ఈ జాతీయ స్థాయి గుర్తింపు తోటి విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు.