BREAKING
శ్రీనివాసపురంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. – వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ లావణ్య .మల్లవరంలో జెడ్పీటీసీ హర్షిత్‌రెడ్డికి పౌరసన్మానం! 450 ఓట్ల మెజారిటీ అందించిన గ్రామానికి రుణపడి ఉంటా – తుమ్మలగుంటతో సమానంగా సి.మల్లవరాన్ని అభివృద్ధి చేస్తా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఘాట్ రోడ్డులో యథావిధిగా వాహనాల రాకపోకలు నినాదాలు కాదు..పిల్లల వర్తమానానికి భరోసా కావాలి! శ్రీ జ్ఞాన జ్యోతి పాఠశాలలో అంబరాన్నంటిన బాలల దినోత్సవ వేడుకలు! ఎల్.ఆర్.జి పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బాలోత్సవం, వార్షికోత్సవం పద్మనాభపురం కాలనీలో చైర్మన్ గంగాభవాని పర్యటన. మధుమేహంపై ప్రతి ఒక్కరూ అవగాహన అవసరం.. జగన్, ఆయన కుటుంబంపై సైబర్ దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి పాత పింఛను విధానానికి దరఖాస్తుల ఆహ్వానం.... గురుకులాల్లో ఘనంగా బాలల దినోత్సవం.. ‘ బాక్సాఫీస్ వద్ద రామాయణ సునామీ.. పది రోజుల్లోనే ₹670 కోట్ల మార్క్ దాటిన రణ్‌బీర్ కపూర్, యశ్ చిత్రం రాష్ట్రస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్‌కు ఏడు ప్రాజెక్టుల ఎంపిక అనపర్తి సర్పంచ్ బరిలో వీరన్నబాబు.

ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి

Select Suryaa Now
ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి

 

∆. ఆర్డీఓకు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి పాల లక్ష్మి

సంతబొమ్మాళి, నవంబర్ 14, మేజర్ న్యూస్ :

సంతబొమ్మాళి మండలంలో ఇటీవల నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు, అధికార దుర్వినియోగం చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్‌సీపీ జడ్పీటీసీ అభ్యర్థి పాల లక్ష్మి (పాల వసంతరెడ్డి భార్య, మాజీ జడ్పీటీసీ) అధికారులను కోరారు. ఈ మేరకు శనివారం ఆర్డీఓను కలిసి వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నవంబర్ 5న జరిగిన పోలింగ్ సమయంలో పలు కేంద్రాల్లో అధికార పార్టీ నాయకులు పోలీసుల సహకారంతో రిగ్గింగ్‌కు పాల్పడ్డారని, వైఎస్సార్‌సీపీ బూత్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల ప్రక్రియకు ఆటంకం కలిగించారని ఆరోపించారు.
అలాగే నవంబర్ 7న జరిగిన ఓట్ల లెక్కింపు సమయంలోనూ వైఎస్సార్‌సీపీ కౌంటింగ్ ఏజెంట్లను భయపెట్టి, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. నాలుగు ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ విజయం సాధించిన పరిస్థితుల్లో, జడ్పీటీసీ స్థానంలో సుమారు 3 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న సమయంలో తమ అభ్యర్థులు, కౌంటింగ్ ఏజెంట్లను కౌంటింగ్ కేంద్రం నుంచి బలవంతంగా బయటకు పంపించారని ఆరోపించారు.
అనంతరం తమకు అనుకూలంగా ఓట్ల లెక్కింపు జరిపి, అన్ని ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానాన్ని కూడా టీడీపీ గెలుచుకున్నట్లు ప్రకటించుకున్నారని ఆమె ఆరోపించారు. గతంలో జడ్పీటీసీ స్థానానికి వచ్చిన మెజారిటీకి ఒక ఓటు కలిపి ప్రకటించారంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై సబ్ కలెక్టర్ కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా ఇప్పటికే ఫిర్యాదు చేశామని, ఎన్నికల కమిషనర్‌తో పాటు పార్టీ అధిష్ఠానానికి కూడా ఫిర్యాదులు పంపించామని తెలిపారు. ఎన్నికల పోలింగ్, ఓట్ల లెక్కింపు సమయంలో జరిగినట్లు ఆరోపిస్తున్న అక్రమాలపై నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరిపించి, వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆర్డీఓను కోరినట్లు పాల లక్ష్మి వెల్లడించారు.