BREAKING
విక్టరీ లో బాలలు దినోత్సవం. బాలీవుడ్ నటులపై బెదిరింపులు, భద్రతా ఆందోళనలు భయానకంగా ఉన్నాయన్న అనన్య పాండే నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ప్రజల ఆశీస్సులే మాకు కొండంత బలం. కోటిపల్లి రేవు దాటేదెట్లా భక్తుల అవస్థ పలాసలో ఘనంగా బాలల దినోత్సవం. ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు తాను దురాశ కలిగిన నటినంటూ అనన్య పాండే ఆసక్తికర వ్యాఖ్యలు.. మైథాలజీ జానర్‌పై ఆసక్తి ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం గ్రంథాలయాలతోనే విజ్ఞాన వికాసం గాంధీనగర్ 4 వీధిలో రోడ్లకు గ్రహణం..! ధురంధర్ అత్యంత అసాధ్యమైన సినిమా అన్నారంటూ ఇంతియాజ్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు.. హెచ్‌టీఎల్ఎస్ 2026లో చర్చ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. డిప్యూటీ ఎంపీడీఓ హెచ్చరిక గాంధీనగర్ 4 వీధిలో రోడ్లకు గ్రహణం..!

కడియపులంక సర్పంచ్ బరిలో కీలక పరిణామం.. పోటీ నుంచి తప్పుకున్న రాంజీ

Select Suryaa Now
కడియపులంక సర్పంచ్ బరిలో కీలక పరిణామం..  పోటీ నుంచి తప్పుకున్న రాంజీ

కడియం, మేజర్ న్యూస్ ,:కడియం మండలం కడియపులంక గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల రాజకీయం కీలక మలుపు తిరిగింది. సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న గట్టు నరసయ్యకు మాజీ ఉపసర్పంచ్ పాఠంశెట్టి రాంజీ మద్దతు ప్రకటించారు. దీంతో గ్రామంలో ఎన్నికల సమీకరణాలు మారుతున్నాయి.
మొదటి నుంచి సర్పంచ్ పదవికి పోటీ చేస్తానని ప్రకటిస్తూ వచ్చిన రాంజీ, తాజాగా తన నిర్ణయాన్ని మార్చుకుని ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. నరసయ్యకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ ఆయనకు అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు.
వీరిద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రత్యేక చొరవ తీసుకున్నట్లు తెలిసింది. నరసయ్యకు మద్దతుగా నిలవాలని రాంజీకి ఎమ్మెల్యే సూచించడంతో ఇరువర్గాల మధ్య చర్చలు జరిగినట్లు సమాచారం. ఈ ప్రక్రియలో కూటమి నాయకులు బోడపాటి గోపి తదితరులు కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.వారి సమక్షంలో ఇరువర్గాల మధ్య సయోధ్య కుదరడంతో రాంజీ పోటీ నుంచి తప్పుకుని నరసయ్యకు మద్దతు ప్రకటించారు. ఇప్పటికే గ్రామంలో ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన నరసయ్యకు రాంజీ మద్దతు తోడవడంతో కడియపులంక రాజకీయాల్లో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇప్పటివరకు విడివిడిగా సాగిన రాజకీయ ప్రయత్నాలు ఒక్కటవడంతో కడియపులంక సర్పంచ్ ఎన్నికల బరిలో కొత్త సమీకరణాలు తెరపైకి వచ్చాయి. మిగిలిన అభ్యర్థుల ప్రచార వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయన్నది గ్రామంలో ఆసక్తికర చర్చగా మారింది.