BREAKING
మధుమేహంపై ప్రతి ఒక్కరూ అవగాహన అవసరం.. జగన్, ఆయన కుటుంబంపై సైబర్ దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి పాత పింఛను విధానానికి దరఖాస్తుల ఆహ్వానం.... గురుకులాల్లో ఘనంగా బాలల దినోత్సవం.. ‘ బాక్సాఫీస్ వద్ద రామాయణ సునామీ.. పది రోజుల్లోనే ₹670 కోట్ల మార్క్ దాటిన రణ్‌బీర్ కపూర్, యశ్ చిత్రం రాష్ట్రస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్‌కు ఏడు ప్రాజెక్టుల ఎంపిక అనపర్తి సర్పంచ్ బరిలో వీరన్నబాబు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలి. జెన్‌జీ తరానికి అనన్య పాండే మద్దతు.. ఊరికే అపవాదు మోస్తున్నారంటూ హెచ్‌టీఎల్ఎస్ 2026లో వ్యాఖ్యలు కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించాలి అధికారుల సమన్వయం, అంకితభావం అభినందనీయం :రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆతిథ్య నిర్వహణలో భేష్.. విక్టరీ లో బాలలు దినోత్సవం. బాలీవుడ్ నటులపై బెదిరింపులు, భద్రతా ఆందోళనలు భయానకంగా ఉన్నాయన్న అనన్య పాండే నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం..

గాంధీనగర్ 4 వీధిలో రోడ్లకు గ్రహణం..!

Select Suryaa Now
గాంధీనగర్ 4 వీధిలో రోడ్లకు గ్రహణం..!


- రహదారులే పార్కింగ్ స్థలాలా..?.
- ఆక్రమణలతో అవస్థలు పడుతున్న వీధివాసులు.

నరసన్నపేట, నవంబర్ 14 మేజర్ న్యూస్ :
నరసన్నపేట గాంధీనగర్ నాలుగో వీధిలో రహదారులు ఆక్రమణలకు గురవుతుండటంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజలు స్వేచ్ఛగా రాకపోకలు సాగించేందుకు ఏర్పాటు చేసిన వీధి రహదారులు కొందరి నిర్లక్ష్యపు వినియోగంతో క్రమంగా కుంచించుకుపోతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా ఆక్రమణలు, రోడ్లపైనే మొక్కల పెంపకం, ఎక్కడపడితే అక్కడ వాహనాల పార్కింగ్‌తో వీధులు రాకపోకలకు అనువుగా లేకుండా మారుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

రోడ్డు ప్రజల కోసం.. ప్రైవేటు పార్కింగ్ కోసం కాదు!

ఇళ్ల ముందు ఖాళీ స్థలం ఉన్నా లేకపోయినా కొందరు తమ ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లను రోడ్లపైనే నిలిపివేస్తుండటంతో మిగిలిన వారికి దారి లేకుండా పోతోంది. ముఖ్యంగా వీధి చివర నివసించే కుటుంబాలు ఇంటి నుంచి బయటకు రావాలన్నా, తిరిగి ఇంటికి చేరాలన్నా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రి వేళల్లో రోడ్లకు అడ్డంగా వాహనాలు నిలిపివేయడంతో అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ లేదా ఇతర వాహనాలు వెళ్లేందుకు కూడా మార్గం ఉండటం లేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వాహనాల పార్కింగ్‌తో ప్రమాదాలు.. పోలీసుల వరకు చేరిన వివాదం!

ఇటీవల ఇదే గాంధీనగర్ నాలుగో వీధిలో రోడ్డుపై నిలిపి ఉంచిన ద్విచక్ర వాహనాన్ని తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో కారు ఢీకొన్న ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులను ఆశ్రయించగా, పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. రహదారులపై ఇష్టారాజ్యంగా వాహనాలు నిలిపివేయడం వల్ల ప్రమాదాలు, వివాదాలు చోటుచేసుకుంటున్నాయని వీధివాసులు పేర్కొంటున్నారు.

గ్రామపంచాయతీ అధికారులు ఏం చేస్తున్నట్లు..?

ప్రజా రహదారులపై ఆక్రమణలు జరుగుతున్నా, వాహనాలు అడ్డదిడ్డంగా నిలిపివేస్తున్నా గ్రామపంచాయతీ అధికారులు కనీస స్థాయిలో చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రోడ్లు ఆక్రమణలకు గురవుతున్నప్పుడు పట్టించుకోకపోవడం, ప్రజలకు రాకపోకలు కష్టమైన తర్వాత కూడా స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. రహదారులు కొందరి సొంత ఆస్తులు కావు.. అవి అందరి ప్రజా అవసరాల కోసం ఉన్నాయని అధికారులు గుర్తించాలని కోరుతున్నారు.

ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు, పోలీసు శాఖ సంయుక్తంగా గాంధీనగర్ నాలుగో వీధిని పరిశీలించి రహదారులపై ఉన్న ఆక్రమణలను గుర్తించి చట్టప్రకారం తొలగించాలని, రోడ్లపై అడ్డదిడ్డంగా వాహనాలు నిలిపే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో వాహనాల పార్కింగ్‌పై నియంత్రణ విధించి, వీధి మొత్తం ప్రజలకు నిరంతర రాకపోకలకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రజలు నడిచేందుకు కూడా వీలులేని పరిస్థితి వస్తే ఇక ఆ రహదారులు ఉన్న ప్రయోజనం ఏమిటి? ప్రమాదం జరిగిన తర్వాత స్పందించడం కంటే, ప్రమాదాలకు కారణమవుతున్న ఆక్రమణలు, అడ్డదిడ్డమైన పార్కింగ్‌ను ముందుగానే అరికట్టడం అధికారుల బాధ్యత కాదా? అని గాంధీనగర్ నాలుగో వీధి ప్రజలు ప్రశ్నిస్తున్నారు.