BREAKING
శ్రీనివాసపురంలో టీడీపీకి గట్టి ఎదురుదెబ్బ.. – వైఎస్సార్సీపీలో చేరిన మాజీ ఎంపీటీసీ లావణ్య .మల్లవరంలో జెడ్పీటీసీ హర్షిత్‌రెడ్డికి పౌరసన్మానం! 450 ఓట్ల మెజారిటీ అందించిన గ్రామానికి రుణపడి ఉంటా – తుమ్మలగుంటతో సమానంగా సి.మల్లవరాన్ని అభివృద్ధి చేస్తా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తుడా మాజీ ఛైర్మన్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఘాట్ రోడ్డులో యథావిధిగా వాహనాల రాకపోకలు నినాదాలు కాదు..పిల్లల వర్తమానానికి భరోసా కావాలి! శ్రీ జ్ఞాన జ్యోతి పాఠశాలలో అంబరాన్నంటిన బాలల దినోత్సవ వేడుకలు! ఎల్.ఆర్.జి పబ్లిక్ స్కూల్‌లో ఘనంగా బాలోత్సవం, వార్షికోత్సవం పద్మనాభపురం కాలనీలో చైర్మన్ గంగాభవాని పర్యటన. మధుమేహంపై ప్రతి ఒక్కరూ అవగాహన అవసరం.. జగన్, ఆయన కుటుంబంపై సైబర్ దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి పాత పింఛను విధానానికి దరఖాస్తుల ఆహ్వానం.... గురుకులాల్లో ఘనంగా బాలల దినోత్సవం.. ‘ బాక్సాఫీస్ వద్ద రామాయణ సునామీ.. పది రోజుల్లోనే ₹670 కోట్ల మార్క్ దాటిన రణ్‌బీర్ కపూర్, యశ్ చిత్రం రాష్ట్రస్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్‌కు ఏడు ప్రాజెక్టుల ఎంపిక అనపర్తి సర్పంచ్ బరిలో వీరన్నబాబు.

పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

Select Suryaa Now
పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం

 

మెలియాపుట్టి. నవంబర్ 14. మేజర్ న్యూస్....రానున్న మార్చి 2027 పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో విద్యార్థులు శతశాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు అత్యుత్తమ మార్కులు పొందేలా ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రణాళికతో బోధన సాగించాలని మండల విద్యాశాఖాధికారి–2 మల్లారెడ్డి పద్మనాభరావు సూచించారు. మిషన్ మార్చ్–2027 కార్యక్రమంలో భాగంగా శనివారం మెలియాపుట్టి మండలంలోని కరజాడ, గొప్పిలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా పదో తరగతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడి వారి అభ్యసన సామర్థ్యాలు, చదువులో ఎదురవుతున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థుల జీవితంలో కీలకమైన దశ అని, ఈ పరీక్షల్లో సాధించే ఫలితాలు భవిష్యత్తు విద్యకు పునాదిగా నిలుస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు ఇప్పటి నుంచే నిర్దిష్ట లక్ష్యాన్ని నిర్దేశించుకుని ప్రతిరోజూ క్రమశిక్షణతో చదవాలని సూచించారు. సమయపాలన పాటిస్తూ అన్ని సబ్జెక్టులకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలని, సందేహాలను ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను అడిగి నివృత్తి చేసుకోవాలని తెలిపారు.
అనంతరం ఉపాధ్యాయులతో మాట్లాడిన ఆయన విద్యార్థుల అభ్యసన స్థాయులను నిరంతరం అంచనా వేయాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అవసరమైన అదనపు బోధన అందించి పరీక్షలకు సన్నద్ధం చేయాలని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు, సబ్జెక్టు ఉపాధ్యాయులు సమన్వయంతో పనిచేస్తూ పాఠశాలల వారీగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు.
మోడల్ పరీక్షలు, స్లిప్ టెస్టులు, ప్రతిరోజూ పునశ్చరణ నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని తొలగించి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించాలని తెలిపారు. పరీక్షల సన్నద్ధతలో విద్యార్థుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన మార్గదర్శకత్వం అందించాలని ఉపాధ్యాయులకు దిశానిర్దేశం చేశారు. మిషన్ మార్చ్–2027 లక్ష్యాన్ని సాధించేందుకు విద్యార్థులు, ఉపాధ్యాయులు సమష్టి బాధ్యతతో కృషి చేయాలని ఎంఈఓ ఆకాంక్షించారు.