BREAKING
జాతీయ స్థాయి పోస్టర్ ప్రజెంటేషన్ పోటీల్లో మోడల్ స్కూల్ విద్యార్థినుల ప్రతిభ.. నామినేషన్ కేంద్రాలను సందర్శించిన కాశీబుగ్గ ఎస్‌హెచ్‌ఓ. బాలల దినోత్సవ వేడుకల్లో నెహ్రూకు ఘన నివాళి మై వాపస్ ఆఊంగా చిత్రంపై ఇంతియాజ్ అలీ ప్రత్యేక దృష్టి.. సినీ ప్రియుల్లో పెరుగుతున్న ఆసక్తి పంచాయతీ ఎన్నికల నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్సై జి. నరేష్ కడియపులంక సర్పంచ్ బరిలో కీలక పరిణామం.. పోటీ నుంచి తప్పుకున్న రాంజీ తల్లిదండ్రులు షర్మిలా ఠాగూర్, టైగర్ పటౌడీ బాల్య ఫొటోలను పంచుకున్న సోహా అలీ ఖాన్.. నెహ్రూతో అరుదైన చిత్రాలు కడియంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం గోపాలపురంలో కేంద్ర బృందం పర్యటన రిటర్నింగ్‌ అధికారులకు ఆన్‌లైన్‌ ప్రక్రియపై అవగాహన బాలీవుడ్ తారలకు కొత్త భద్రతా వలయం.. ఆరు నుంచి ఏడుగురు సిబ్బందితో బందోబస్తు మొక్కజొన్న సాగులో మెలకువలపై శిక్షణ దీపావళి వేడుకలకు వెళ్లలేకపోయిన రిషి కపూర్.. అత్తగారు కవర్ చింపేసిన ఆసక్తికర ఘటన గుర్తుచేసుకున్న నీతూ కపూర్ సిద్దిపేట సభ ఏర్పాట్ల సమావేశంలో కాట శ్రీనివాస్‌గౌడ్ విజ్ఞాన్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు

మొక్కజొన్న సాగులో మెలకువలపై శిక్షణ

Select Suryaa Now
మొక్కజొన్న సాగులో మెలకువలపై శిక్షణ

కె గంగవరం, మేజర్ న్యూస్:కె.గంగవరం మండలం శేరిలంక గ్రామంలో ఆత్మ సౌజన్యంతో మొక్కజొన్న సాగులో మెలకువలపై రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.మండల వ్యవసాయ అధికారి ఏ.సద్గురుమూర్తి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏరువాక కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎం.నందకిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కజొన్నలో మేలైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు.సమతుల్య ఎరువుల వినియోగంతో పాటు పూతకు ముందు,పూత దశలో,గింజ పాలు పోసుకునే సమయంలో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలని సూచించారు.కత్తెర పురుగు ఉధృతిపై అప్రమత్తంగా ఉండి,సకాలంలో నివారణ చర్యలు చేపట్టాలని రైతులకు సూచించారు.కార్యక్రమంలో వీహెచ్ఏ సుజీత్,వీఏఏ తేజనాని,రైతులు పాల్గొన్నారు