BREAKING
విక్టరీ లో బాలలు దినోత్సవం. బాలీవుడ్ నటులపై బెదిరింపులు, భద్రతా ఆందోళనలు భయానకంగా ఉన్నాయన్న అనన్య పాండే నిరుద్యోగ యువతకు సువర్ణావకాశం.. ప్రజల ఆశీస్సులే మాకు కొండంత బలం. కోటిపల్లి రేవు దాటేదెట్లా భక్తుల అవస్థ పలాసలో ఘనంగా బాలల దినోత్సవం. ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు తాను దురాశ కలిగిన నటినంటూ అనన్య పాండే ఆసక్తికర వ్యాఖ్యలు.. మైథాలజీ జానర్‌పై ఆసక్తి ఎన్నికల అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలి పదో తరగతిలో శతశాతం ఉత్తీర్ణతే లక్ష్యం గ్రంథాలయాలతోనే విజ్ఞాన వికాసం గాంధీనగర్ 4 వీధిలో రోడ్లకు గ్రహణం..! ధురంధర్ అత్యంత అసాధ్యమైన సినిమా అన్నారంటూ ఇంతియాజ్ అలీ ఆసక్తికర వ్యాఖ్యలు.. హెచ్‌టీఎల్ఎస్ 2026లో చర్చ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. డిప్యూటీ ఎంపీడీఓ హెచ్చరిక గాంధీనగర్ 4 వీధిలో రోడ్లకు గ్రహణం..!

కడియంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

Select Suryaa Now
కడియంలో జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభం

             పుస్తక పఠనంతోనే విజ్ఞానం.. విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి

కడియం ,మేజర్ న్యూస్, :59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు, బాలల దినోత్సవం సందర్భంగా శనివారం మండల కేంద్రం కడియం శాఖా గ్రంథాలయంలో వారోత్సవాలను ఘనంగా ప్రారంభించారు. గ్రంథాలయాధికారి ఎం. వీరలింగం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మండల విద్యాశాఖాధికారి వై. నాగేశ్వరరావు, సరస్వతీ దేవి చిత్రపటానికి పూలమాల వేసి వారోత్సవాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ప్రతిరోజూ గ్రంథాలయాన్ని సందర్శించి వివిధ పుస్తకాలను చదవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. పుస్తక పఠనం ద్వారా విజ్ఞానం, ఆలోచనా శక్తి పెంపొందుతాయని తెలిపారు. వారం రోజుల పాటు నిర్వహించే వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన వివిధ పోటీల్లో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు సాధించాలని ఆకాంక్షించారు.
అనంతరం రైస్ మిల్లు యజమాని ఉప్పులూరి హనుమంతరావు మాట్లాడుతూ గ్రంథాలయాలు విద్యార్థులకు విజ్ఞాన భాండాగారాలని పేర్కొన్నారు. పుస్తక పఠనంతో పాటు పుస్తక సమీక్షలు, వివిధ అంశాలపై అవగాహన పెంపొందించుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 108 మంది, ఉపాధ్యాయులు, అంగన్‌వాడీ సిబ్బంది, గ్రంథాలయ పాఠకులు తదితరులు పాల్గొన్నారు.