నామినేషన్ కేంద్రాలను సందర్శించిన కాశీబుగ్గ ఎస్‌హెచ్‌ఓ.
భద్రతా ఏర్పాట్ల పరిశీలన - నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు.
ఎస్‌హెచ్‌ఓ ఎం అప్పారావు హెచ్చరిక.
పలాస, నవంబర్ 14, మేజర్ న్యూస్.
సోమవారం నుంచి ప్రారంభం కానున్న పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ నామినేషన్ కేంద్రాలను సందర్శించి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ కేంద్రాల వద్ద చేపట్టిన భద్రతా చర్యలు, పోలీసు బందోబస్తు, రాకపోకల నియంత్రణ, అభ్యర్థులు మరియు వారి అనుచరుల రాకపోకల నిర్వహణ తదితర అంశాలను సమీక్షించారు.నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు సిబ్బందికి ఎస్‌హెచ్‌ఓ సూచించారు.ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అభ్యర్థులు, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రక్రియకు పోలీసులకు సహకరించాలని, ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ప్రజాస్వామ్య హక్కులను వినియోగించుకోవాలని ఎస్‌హెచ్‌ఓ విజ్ఞప్తి చేశారు.ప్రశాంతమైన వాతావరణంలో పారదర్శకంగా పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరిగేలా కాశీబుగ్గ పోలీసులు అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపట్టడం జరిగిందని ఆయన స్పష్టం చేసారు.