లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలి
భీమదేవరపల్లి, మేజర్ న్యూస్, భీమదేవరపల్లి ప్రభుత్వ పాఠశాలలో శనివారం బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న గ్రామ సర్పంచ్ మాచర్ల కుమారస్వామి మాట్లాడుతూ.. విద్యార్థి దశ జీవితానికి బంగారు పునాది అని, చదువుకునే వయస్సులో చదువుపైనే ఏకాగ్రత చూపాలని సూచించారు. ప్రతి విద్యార్థి నిర్దిష్ట లక్ష్యాన్ని ఏర్పరచుకుని క్రమశిక్షణ, పట్టుదలతో విద్యనభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంతో పాటు పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు భాస్కర్‌రెడ్డి, వేణుగోపాల్, వార్డు సభ్యులు శ్యామ్, శ్రీనివాస్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, లలిత, సంధ్య, సీఏలు రాణి, కవిత, తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్ :రామకృష్ణ ,భీమదేవరపల్లి హనుమకొండ జిల్లా