టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్.. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన యువనేత
టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్.. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన యువనేతటెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్.. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన యువనేత!
టెక్కలి:
శ్రీకాకుళం జిల్లాలోని ప్రతిష్టాత్మక టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ స్థానానికి రాజకీయం వేడెక్కుతోంది. ఈ ఎన్నికల్లో స్థానిక యువ నాయకుడు కోళ్ల లవకుమార్ సర్పంచ్ బరిలో నిలిచేందుకు సర్వసన్నద్ధమవుతున్నారు. పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా, కేడర్‌కు భరోసానిస్తూ పార్టీని ఒంటిచేత్తో కాపాడిన నాయకుడిగా లవకుమార్‌కు పేరుంది.
అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీ నుంచి ఎదురైన వేధింపులు, తప్పుడు కేసులను సైతం లెక్కచేయకుండా ధైర్యంగా నిలబడి పార్టీ జెండాను ఎగరేసిన యోధుడు ఆయన. ఇటీవల జరిగిన ఎంపీటీసీ ఎన్నికల్లోనూ తనదైన వ్యూహాలతో పార్టీ అభ్యర్థుల విజయానికి కీలక పాత్ర పోషించారు.
ఘనమైన రాజకీయ వారసత్వం..
కోళ్ల లవకుమార్‌కు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది. ఆయన తాత కోళ్ల భీముడు.. రాష్ట్ర రాజకీయాల్లో ధృవతారగా వెలుగొందిన స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్నతో కలిసి పనిచేశారు. వారిద్దరి మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు చరిత్రలో నిలిచాయి. అంతేకాకుండా, ఆయన చిన్నాన్న, దివంగత కోళ్ల అప్పన్న రాజకీయ వారసత్వాన్ని పుణికిపుచ్చుకుని లవకుమార్ ప్రజాసేవలో ముందుకుసాగుతున్నారు.
మంత్రుల అండదండలు..
ప్రస్తుత రాజకీయ సమీకరణాల నేపథ్యంలో లవకుమార్‌కు కేంద్ర, రాష్ట్ర మంత్రుల ఆశీస్సులు, అండదండలు పుష్కలంగా ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టెక్కలి పంచాయతీ పీఠంపై గట్టి పట్టు సాధించేందుకు ఆయన వర్గం అన్ని ఏర్పాట్లు చేసుకుంటుంది. ప్రస్తుతం రాష్ట్ర మంత్రి గ్రీన్ సిగ్నల్ (మాట) కోసం లవకుమార్ అనుచరగణం, శ్రేయోభిలాషులు ఆసక్తిగా నిరీక్షిస్తున్నారు. మంత్రి నుంచి స్పష్టత రాగానే ఎన్నికల బరిలో ఆయన దూకుడు పెంచే అవకాశం ఉంది.