BREAKING
టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్.. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన యువనేత ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసిపి లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలి ఎస్ ఆర్ కె పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు

రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు

Select Suryaa Now
రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు

సిద్దిపేట అర్బన్, :బక్రీ చెప్యాల గ్రామంలో రైతులు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యకు ఎట్టకేలకు పరిష్కారం లభించింది. అధిక విద్యుత్ లోడ్ కారణంగా గ్రామంలోని ట్రాన్స్‌ఫార్మర్ కాలిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పలుమార్లు ఫ్యూజులు ఎగిరిపోవడం, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడటంతో పంటలకు సకాలంలో నీరు అందక పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొంది.ఈ సమస్యను గ్రామ రైతులు విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లగా అధికారులు వెంటనే స్పందించారు. రైతుల ఇబ్బందులను గుర్తించి పాత ట్రాన్స్‌ఫార్మర్ స్థానంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను ఏర్పాటు చేయడంతో విద్యుత్ సరఫరా సమస్యకు పరిష్కారం లభించింది. దీంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు.సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వెంటనే స్పందించి పరిష్కారం చూపిన డీఈ రామచంద్రయ్య, ఏడీఈ శ్రీనివాస్, ఏఈ శ్రీధర్ రెడ్డి, సిద్ధారెడ్డిలకు బక్రీ చెప్యాల గ్రామ రైతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతుల సమస్యల పట్ల అధికారులు చూపిన చొరవ, సత్వర స్పందన అభినందనీయమని పేర్కొన్నారు.