BREAKING
ఎన్విడియా తదుపరి సీఈఓగా రెనే హాస్? జెన్సెన్ హువాంగ్ వారసుడిపై టెక్ దిగ్గజం కసరత్తు టీయూడబ్ల్యూజె – ఐజెయు కమిటీలో లక్షెట్టిపేట ప్రెస్ క్లబ్‌కు కీలక పదవులు ! సీఎంఎస్ ఇన్ఫో సిస్టమ్స్ క్యూ2 ఫలితాలు: రూ. 660 కోట్లకు పెరిగిన ఆదాయం, రూ. 81 కోట్ల నికర లాభం నమోదు రూ. 8,415 కోట్ల AT-1 బాండ్ల రద్దు తీర్పుపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసిన యెస్ బ్యాంక్ సిగరెట్ ధరలను మళ్లీ పెంచిన ఐటీసీ: గోల్డ్ ఫ్లేక్, క్లాసిక్ కనెక్ట్ కొత్త రేట్లు ఇవే నేటి పంచాంగం 14 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు (14 నవంబర్ 2026, శనివారం): 12 రాశుల దినఫలాలు ఇవే మాస్కోలో భారీ కారు బాంబు పేలుడు: రష్యా అనుకూల నేత సెర్గీ జవోరోట్నీకి తీవ్ర గాయాలు అదానీ విద్యుత్ ప్రాజెక్టు వ్యయం తగ్గింపుపై కేంద్ర పర్యావరణ శాఖ విచారణ చకుముఖి టాలెంట్ టెస్టులో శ్రీవాణి విద్యార్థుల ప్రతిభ మండల స్థాయి పోటీలకు ముగ్గురు విద్యార్థుల ఎంపిక పాకిస్థాన్‌కు సైనిక రహస్యాల చేరవేత: వాయుసేన వింగ్ కమాండర్‌పై చార్జిషీట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు రైతుల విద్యుత్ కష్టాలకు తెర.. కొత్త ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు ఎల్నినో ప్రభావం నేపథ్యంలో వార్డుల్లో నీటిని, విద్యుత్తును పొదుపుగా వాడుకోవాలి ఇరాన్‌లో చిక్కుకున్న భారతీయ నావికుడు...అత్యవసర సర్టిఫికేట్ జారీ, త్వరలో స్వదేశానికి రాక భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును కాపాడుకుందాం

టీయూడబ్ల్యూజె – ఐజెయు కమిటీలో లక్షెట్టిపేట ప్రెస్ క్లబ్‌కు కీలక పదవులు !

Select Suryaa Now
టీయూడబ్ల్యూజె – ఐజెయు కమిటీలో లక్షెట్టిపేట ప్రెస్ క్లబ్‌కు కీలక పదవులు !

• 92 ఓట్ల ఆధిక్యంతో ఉపాధ్యక్షులుగా కుమార స్వామి విజయం..

•  సంయుక్త కార్యదర్శిగా, కార్యవర్గ సభ్యుడిగా మరో ఇద్దరికి బాధ్యతలు

సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి :

 మంచిర్యాల పట్టణంలోని స్థానిక ఫంక్షన్ హాల్లో శుక్రవారం జరిగిన టీయూడబ్ల్యూజె – ఐజెయు మంచిర్యాల జిల్లా కమిటీ ఏర్పాటులో లక్షెట్టిపేట ప్రెస్ క్లబ్‌కు చెందిన ముగ్గురికి కీలక పదవులు దక్కడం పట్ల ప్రెస్ క్లబ్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కమిటీ ఎన్నికల్లో లక్షెట్టిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బోనగిరి కుమార స్వామి 92 ఓట్ల ఆధిక్యంతో ఉపాధ్యక్షులుగా విజయం సాధించారు. అదేవిధంగా వొజ్జల శ్రీనివాస్ సంయుక్త కార్యదర్శిగా, మల్యాల సంతోష్ జిల్లా కార్యవర్గ నిర్వాహకుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ఒకే ప్రెస్ క్లబ్‌కు చెందిన ముగ్గురు జర్నలిస్టులకు జిల్లా స్థాయి కమిటీలో కీలక బాధ్యతలు లభించడం పట్ల లక్షెట్టిపేట ప్రెస్ క్లబ్ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. నూతనంగా ఎన్నికైన ముగ్గురికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి, పాత్రికేయుల హక్కుల పరిరక్షణకు తమ వంతు కృషి చేయాలని ఆకాంక్షించారు.