BREAKING
టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్.. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన యువనేత ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసిపి లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలి ఎస్ ఆర్ కె పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు

మల్లన్నసాగర్ లీకేజీపై హరీశ్‌రావుకు కవిత సవాల్! అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమా..? సీఎం రేవంత్‌ రెడ్డికి సూటి ప్రశ్నలు

Select Suryaa Now
మల్లన్నసాగర్ లీకేజీపై హరీశ్‌రావుకు కవిత సవాల్!  అవినీతి ఆరోపణలపై విచారణకు సిద్ధమా..? సీఎం రేవంత్‌ రెడ్డికి సూటి ప్రశ్నలు

సిద్దిపేట : సిద్దిపేట రాజకీయ వేదికగా మరోసారి సాగునీటి ప్రాజెక్టుల అవినీతి ఆరోపణలు తెరపైకి వచ్చాయి. తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావును లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. మల్లన్నసాగర్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు, కెమికల్ ట్రీట్‌మెంట్, భవిష్యత్తులో తలెత్తే ప్రమాదాలపై వచ్చిన నివేదికలను పట్టించుకోకుండా ప్రాజెక్టు నిర్మించారని ఆరోపించారు. ప్రస్తుతం మల్లన్నసాగర్‌లో లీకేజీ సమస్య తలెత్తడానికి ఆనాటి ఇరిగేషన్ మంత్రి హరీశ్‌రావు అవినీతి చర్యలే కారణమని ఆమె ఆరోపించారు.నిమ్స్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రూ.100 కోట్ల వ్యవహారంపై విచారణ జరిపించే ధైర్యం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి ఉందా? అని ప్రశ్నించారు. కొండపోచమ్మసాగర్ నిర్మాణంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతిపై ప్రభుత్వం ఎందుకు మౌనం వహిస్తోందని నిలదీశారు.టన్నెల్‌ను కాలువగా మార్చి అంచనా వ్యయాన్ని రూ.1,700 కోట్ల మేర పెంచిన వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని నివేదికలు సూచించినప్పటికీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. హరీశ్‌రావుపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు.ఇదిలా ఉండగా, సిద్దిపేటలోని రంగధాంపల్లి చౌరస్తాలో తెలంగాణ రక్షణ సేన పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణానికి పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అనిల్ దంపతులు భూమిపూజ నిర్వహించారు. అంతకుముందు శ్రీ ఉమా పార్థివ కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో కవిత ప్రత్యేక పూజలు చేశారు.సిద్దిపేటలో పార్టీ కార్యాలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా కవిత చేసిన ఈ వ్యాఖ్యలు జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రాజెక్టుల నిర్మాణం, నిధుల వ్యయం, నాణ్యత, అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం స్పందిస్తుందా? ఆరోపణలపై విచారణకు ఆదేశిస్తుందా? అన్నది రాజకీయంగా ఆసక్తికరంగా మారింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు, టి.ఆర్.ఎస్  పార్లమెంట్ ఇన్చార్జీలు , నియోజకవర్గ ఇన్చార్జీలు, తదితరులు పాల్గొన్నారు.