BREAKING
టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్.. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన యువనేత ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసిపి లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలి ఎస్ ఆర్ కె పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు

జూలపల్లి మండలానికి 406 నూతన పింఛన్లు మంజూరు పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్ విజయ రమణారావు

Select Suryaa Now
జూలపల్లి మండలానికి 406 నూతన పింఛన్లు మంజూరు పత్రాలు అందజేసిన ప్రభుత్వ విప్ విజయ రమణారావు
సూర్య జూలపల్లి;;అర్హులైన పేదలకు సామాజిక భద్రత కల్పించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. ఎలిగేడు మండలం దూళికట్ట గ్రామంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ ప్రాంగణంలో శుక్రవారం ఎలిగేడు, జూలపల్లి మండలాల లబ్ధిదారులకు నూతన చేయూత పింఛన్ల మంజూరు పత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జూలపల్లి మండలంలోని 13 గ్రామాలకు చెందిన 406 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే మంజూరు పత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం పేదలు, మహిళలు, చేనేత, గీత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తోందన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా 5,124 నూతన పింఛన్లు మంజూరయ్యాయని తెలిపారు. సాంకేతిక కారణాలతో పింఛన్లు పొందలేకపోయిన అర్హుల దరఖాస్తులను మరోసారి పరిశీలించి, రీ-సర్వే ద్వారా న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మంజూరు పత్రాలు పొందిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నవంబర్ 19న పింఛన్ నగదు జమ అవుతుందని వెల్లడించారు.జూలపల్లి మండలానికి మంజూరైన 406 పింఛన్లలో 233 వితంతు పింఛన్లు, 92 దివ్యాంగ పింఛన్లు, 28 ఒంటరి మహిళల పింఛన్లు, 52 గీత కార్మికుల పింఛన్లు, ఒక చేనేత పింఛను ఉన్నాయి.గ్రామాల వారీగా చూస్తే అబ్బాపూర్‌లో 29, బాలరాజుపల్లెలో 3, చీమలపేటలో 13, జూలపల్లిలో 79, కాచాపూర్‌లో 51, కీచులాటపల్లెలో 8, కోనరావుపేటలో 16, కుమ్మరికుంటలో 48, నాగుపల్లెలో 9, పెద్దాపూర్‌లో 55, తెలుకుంటలో 38, వెంకట్రావుపల్లెలో 23, వడ్కాపూర్‌లో 34 మందికి పింఛన్లు మంజూరయ్యాయి.ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పద్మజ, పంచాయతీ కార్యదర్శులు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, సింగిల్ విండో చైర్మన్లు, డైరెక్టర్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.