telangana
దుమ్ముతో ఇబ్బందులు తొలగించాలని కార్యదర్శికి వినతి.
సూర్య రామడుగు ;;రామడుగు మండలం గుండి గ్రామంలో ప్రధాన రహదారిపై బస్టాండ్ ప్రాంతంలో ప్రభుత్వ హై స్కూల్ నుండి గ్రామపంచాయతీ కార్యాలయం వరకు అసంపూర్తిగా ఉన్న రోడ్డుపై దుమ్ముతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని గ్రామస్తులు గ్రామ సర్పంచ్ మల్లేశం గ్రామ కార్యదర్శిల కు వినతిపత్రం సమర్పించారు. దీనికి స్పందించిన సర్పంచ్ కార్యదర్శులు ప్రధాన రోడ్డుపై దుమ్ము లేవకుండా ప్రతిరోజు నీటిని రోడ్డుపై పోయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ శ్యామ్ శ్రీనివాస్ గ్రామస్తులు పాల్గొన్నారు.