BREAKING
టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్.. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన యువనేత ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసిపి లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలి ఎస్ ఆర్ కె పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు

నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు

Select Suryaa Now
నగర సంకీర్తనతో ఆధ్యాత్మిక మేలుకొలుపు

రామచంద్రపురం నియోజవర్గం మండల కేంద్రమైన కె గంగవరంలో కార్తీక మాసాన్ని పురస్కరించుకుని శ్రీ భక్తాంజనేయ బాల భక్త సమాజం,బృందావన విహారి బృందం ఆధ్వర్యంలో నగర సంకీర్తన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తున్నారు.మంగళవారం కార్తీక శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని కార్తీక మాసమంతా ప్రతిరోజూ తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో గ్రామ వీధుల్లో కొనసాగించనున్నారు.పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో పూర్వీకులు అందించిన ఆధ్యాత్మిక సంప్రదాయాలను భావితరాలకు అందించాలనే సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.తెల్లవారుజామున భక్తులు గ్రామ వీధుల్లో పర్యటిస్తూ లయబద్ధమైన భజనలు,కీర్తనలతో భగవన్నామ స్మరణ చేస్తున్నారు.దీంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తోంది.కనుమరుగవుతున్న హిందూ సంస్కృతి,సంప్రదాయాల గొప్పతనాన్ని నేటి యువతకు పరిచయం చేయడం,వారిలో భక్తిభావం,ఆధ్యాత్మిక చింతన పెంపొందించడం,గ్రామ శ్రేయస్సును ఆకాంక్షించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.మన సంస్కృతి,సంప్రదాయాలను భావితరాలకు వారసత్వ సంపదగా అందించాలనే సదుద్దేశంతో నగర సంకీర్తనను నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో దునే ఏసు ,దునే శ్రీనివాస్,లక్ష్మి శ్రీనివాస్,గంగాపాత్రుల సత్యనారాయణ,పెంటపాటి జానకి,బృందావన విహారి బృందానికి చెందిన లక్ష్మీ పద్మావతి,గంగాపాత్రుల సత్యనారాయణమ్మ,దునే లత తదితరులు పాల్గొంటున్నారు.