BREAKING
టెక్కలి మేజర్ పంచాయతీ సర్పంచ్ బరిలో కోళ్ల లవకుమార్.. పార్టీ కష్టకాలంలో వెన్నంటి నిలిచిన యువనేత ధర్మసాగర్ పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన ఏసిపి లక్ష్యాన్ని నిర్దేశించుకుని క్రమశిక్షణతో చదవాలి ఎస్ ఆర్ కె పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవం ధర్మసాగర్ గ్రామపంచాయతీలో చేయూత పెన్షన్ ప్రొసీడింగ్ కాపీలు పంపిణీ ధర్మసాగర్ లో చాచా నెహ్రూ పుట్టినరోజు వేడుకలు ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు కుందారం గ్రామంలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు భక్తి పరవశంతో నగర సంకీర్తన ముగిసిన జాతీయ సదస్సు అన్వేషణ సౌత్ జోన్ విజేతగా ఎస్వీయూ బాల్య వివాహాలను అరికడదాం ఘనంగా గ్రంధాలయ వారోత్సవాలు ప్రారంభం బాలల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కృషి చేస్తాం వికసిత్ భారత్ యువత లక్ష్యం... -ఎస్విసిఈలో రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికలు

వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన జిల్లా కార్యదర్శి

Select Suryaa Now
వైఎస్సార్‌సీపీలో చేరిన జనసేన జిల్లా కార్యదర్శి

                             మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సమక్షంలో మైరెడ్డి గంగాధర్ చేరిక

రాజానగరం, మేజర్ న్యూస్,:తూర్పుగోదావరి జిల్లా,రాజానగరం మండలం నరేంద్రపురం గ్రామానికి చెందిన జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి మైరెడ్డి గంగాధర్ శుక్రవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా ఆయనకు పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ పార్టీని క్షేత్ర స్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని జక్కంపూడి రాజా తెలిపారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంపై విశ్వాసం తో వివిధ పార్టీల నాయ కులు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారని పేర్కొన్నారు.

మైరెడ్డి గంగాధర్ పార్టీలో చేరికతో నరేంద్రపురం గ్రామంలో వైఎస్సార్‌సీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. రానున్న రోజు ల్లో మరింత మంది నాయ కులు, కార్యకర్తలు పార్టీ లోకి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.