యువత స్వయం ఉపాధికి ప్రభుత్వ ప్రోత్సాహం
- కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆమనగల్లు, రంగారెడ్డి:
నిరుద్యోగ యువత తమకు నచ్చిన ఉపాధిని ఎంచుకొని ఏర్పాటు చేసుకునే స్వయం ఉపాధికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. బుధవారం పట్టణంలోని 12వ వార్డు శాంతినగర్ కు చెందిన సాయి కిరణ్ ఏర్పాటు చేసిన కేక్ హౌస్ బేకరీ ని ఆయన మున్సిపాలిటీ చైర్మన్ పత్యా నాయక్, ఎస్ హెచ్ ఓ వెంకటేశ్వర్లు, సింగిల్ విండో చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, దళిత సంఘాల జిల్లా నాయకుడు పసుపుల జంగయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు యాట నరసింహ,ఆమనగల్ మండల, టౌన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, శివలింగం తో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేటి యువత ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తూ కాలం వృధా చేసుకోకుండా తమకు నచ్చిన, ఆసక్తి కలిగిన రంగంలో స్వయం ఉపాధిని ఎంచుకోవాలని కోరారు. నిరుద్యోగ యువత స్వయం ఉపాధిని ఏర్పాటు చేసుకుని ధైర్యంగా ముందుకు అడుగు వేసి, తన కాళ్లపై తాను నిలబడటమే కాకుండా, మరో పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కో ఆప్షన్ ఖాదర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ శ్రీశైలం, కౌన్సిలర్ అనితశ్రీనివాసరెడ్డి. సింగిల్ విండో డైరెక్టర్ మల్లయ్య, సర్పంచ్ మంగ్లీ రాములు, ఉప సర్పంచ్ విజయ్ రాథోడ్,సురేష్ నాయక్. గిరిజన ఆదివాసి రాష్ట్ర నాయకులు కృష్ణా నాయక్, నాయకులు కొండల్ రెడ్డి, సురేష్ నాయక్, శ్రీకాంత్,పర్వతాలు,కరీం,శీను నాయక్, మైసయ్య, రఘు,పూసలపరమేష్,మహేష్,పురుషోత్తం,నరసింహ,గోల్డ్ రాము,ఎంగలి ప్రసాద్, శివ, తదితరులు పాల్గొంటున్నారు.
ఎ. చంద్రశేఖర్, మేజర్ న్యూస్.