BREAKING
కార్తీక మాసంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు దుర్గమ్మను దర్శించుకున్న సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు యువతలో నాయకత్వ లక్షణాలకు యూత్ పార్లమెంట్ పోటీలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం : కలెక్టర్ డీకే బాలాజీ జనగణన–2027 రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నగర పోలీస్ కమిషనర్ నివాళులు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసుల విస్తృత తనిఖీలు ఆజాద్ ఆశయాలతో విద్యారంగ అభివృద్ధికి లోకేష్ కృషి మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం చందర్లపాడు మండల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా : ఎంపీ కేశినేని చిన్ని విజయవాడకు మరోసారి జాతీయస్థాయి స్వచ్ఛత పురస్కారం కృష్ణా జడ్పీ పీఠంపై ఉత్కంఠ! ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా హోటళ్లు, ఆహార సంస్థలు పనిచేయాలి పోరంకిలో ఘనంగా ‘మైండ్ స్పార్క్’ విజ్ఞాన ప్రదర్శన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు, విద్యా సేవలు చిరస్మరణీయం

భూ సేకరణలో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తా...!

Select Suryaa Now
భూ సేకరణలో అక్రమాలు జరిగినట్లు నిరూపిస్తా...!

గీసుగొండ , మేజర్ న్యూస్, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు భూసేకరణలో అవినీతి జరిగినట్లు తాను నిరూపిస్తానని,దీనికి కాంగ్రెస్,బిఆర్ఎస్ నాయకులు బహిరంగ చర్చకు సిద్ధమేనా అని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు కొంగర రవి కుమార్ సవాల్ విసిరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు అనే సామెత ఉందని,ఇప్పుడు కొంతమంది అవగాహన లేని కాంగ్రెస్ నాయకుల తీరు చూస్తే ఒళ్లంతా తడుముకున్నట్లుగా ఉందని కొంగర రవి కుమార్ ఎద్దేవా చేశారు.కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ భూసేకరణ అక్రమాలపై బహిరంగ చర్చకు బీఆర్ఎస్,కాంగ్రెస్ సిద్ధమేనా అని ప్రశ్నించారు.గీసుగొండ మండలం శాయంపేట హవేలి గ్రామంలో కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ భూసేకరణ సమయంలో జరిగిన అక్రమాలపై బీజేపీ ప్రశ్నిస్తుంటే,విచారణ జరిపించాల్సిన కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులకు అండగా నిలుస్తూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు.భూసేకరణ గత బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని,అప్పటి పాలకులు,సంబంధిత అధికారులు, భూసేకరణలో భాగస్వాములైన వ్యక్తుల పాత్రపై సమగ్ర విచారణ జరిపించాలి అనీ ప్రజల తరఫున మేము అడగడం తప్ప? రైల్వే గుడ్ షెడ్ విషయంలో పోలీసులను అడ్డం పెట్టుకొని కొంతమంది అమాయక హమాలీలను ఆరోజు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ పంపించి భయభ్రాంతులకు గురిచేసి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నవారిని హమాలీ కూలీలను పెట్టుకొని మిగతా రోజువారి కూలీలను కడుపు కొట్టిన మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. చెరువులో మట్టి అమ్మి కాంట్రాక్టర్ సిమెంటు గచ్చు వేపిస్తే అది కాంగ్రెస్ పార్టీ చేపించింది అని శిలాఫలకం వేయించుకున్నది మాట వాస్తవం కాదా? ప్రజాధనానికి కాంగ్రెస్ పార్టీకి ఏం సంబంధం?ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి.  కానీ ఇప్పుడు కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కు లో జరిగిన అవినీతి గురించి  ప్రశ్నిస్తున్నామన్నారు.ఉన్నత అధికారులతో విచారణ చేపించి భూసేకరణ సమయంలో బినామీ పేర్లతో పరిహారం పొంది,బోరుబావులు లేని భూముల్లో ప్లాస్టిక్ పైపులు ఏర్పాటు చేసి బోరుబావులు ఉన్నట్లుగా ఫొటోలు చూపించి పరిహారం పొందడం వంటి అక్రమాలు జరిగిన వాస్తవాలపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.నిజమైన రైతులకు అందాల్సిన పరిహారం ఎవరికి చేరిందో ప్రజలకు వెల్లడించాలన్నారు.కొంతమంది కాంగ్రెస్ నాయకులు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి,కలెక్టర్‌తో మాట్లాడినట్లు గొప్పగా చెబుతున్నారని,ఎమ్మెల్యే పేరు వాడుకోగానే సరిపోదని,అంతే నిజాయితీగా ప్రజలకు సమాధానం చెప్పే బాధ్యత కూడా ఉండాలన్నారు. ఇప్పటివరకు ఎంతమంది నిజమైన రైతులకు న్యాయం జరిగింది? ఎంతమందికి పరిహారం అందింది? అధికారులు పూర్తి వివరాలు వెల్లడించాలన్నారు.ఈ భూసేకరణకు సంబంధించిన ఆధారాలతో ముందుకు వస్తామని,మీరు విచారణకు సిద్ధంగా ఉన్నారా? ఏ తేదీన వస్తారో చెప్పండి. కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ భూసేకరణ సమయంలో విధులు నిర్వహించిన సంబంధిత ప్రతీ అధికారి పాల్గొనేలా చేయాలని డిమాండ్ చేశారు.
గీసుగొండ మండల కేంద్రంలో చేద్దామా? కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ ప్రాంగణంలోనే చేద్దామా?
లేక శాయంపేట హవేలి గ్రామంలో ప్రజల సమక్షంలోనే చర్చిద్దామా?అని ప్రశ్నించారు.కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు ఇద్దరూ సిద్ధంగా ఉన్నారా? తేదీ,సమయం మీరే ప్రకటించాలని,
వాస్తవాలకు సమాధానం చెప్పాలని,తప్పు జరగలేదని నమ్మకం ఉంటే స్వతంత్ర విచారణకు సహకరించాలన్నారు. రాజకీయ విమర్శలతో రైతుల సమస్యను పక్కదారి పట్టించలేరు. నిజమైన రైతులకు న్యాయం జరిగే వరకు బీజేపీ పోరాటం కొనసాగుతుంది.ఆధారాలతో ప్రశ్నిస్తాం.. బహిరంగంగా చర్చిస్తాం.. నిజాలు ప్రజల ముందు ఉంచుతాం అన్నారు.

రిపోర్టర్: విష్ణు చందర్, గీసుకొండ, వరంగల్ జిల్లా