BREAKING
కార్తీక మాసంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు దుర్గమ్మను దర్శించుకున్న సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు యువతలో నాయకత్వ లక్షణాలకు యూత్ పార్లమెంట్ పోటీలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం : కలెక్టర్ డీకే బాలాజీ జనగణన–2027 రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నగర పోలీస్ కమిషనర్ నివాళులు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసుల విస్తృత తనిఖీలు ఆజాద్ ఆశయాలతో విద్యారంగ అభివృద్ధికి లోకేష్ కృషి మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం చందర్లపాడు మండల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా : ఎంపీ కేశినేని చిన్ని విజయవాడకు మరోసారి జాతీయస్థాయి స్వచ్ఛత పురస్కారం కృష్ణా జడ్పీ పీఠంపై ఉత్కంఠ! ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా హోటళ్లు, ఆహార సంస్థలు పనిచేయాలి పోరంకిలో ఘనంగా ‘మైండ్ స్పార్క్’ విజ్ఞాన ప్రదర్శన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు, విద్యా సేవలు చిరస్మరణీయం

విజయవాడకు మరోసారి జాతీయస్థాయి స్వచ్ఛత పురస్కారం

Select Suryaa Now
విజయవాడకు మరోసారి జాతీయస్థాయి స్వచ్ఛత పురస్కారం

విజయవాడ కార్పొరేషన్, మేజర్ న్యూస్ : విజయవాడ నగరపాలక సంస్థకు స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26లో మరోసారి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. బుధవారం సాయంత్రం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్, స్వచ్చంద్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం. ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ మాట్లాడుతూ, స్వచ్ఛ సర్వేక్షణ్ 2025-26 పురస్కారాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఆరు నగరాలు, పట్టణాలు వివిధ కేటగిరీల్లో అవార్డులు సాధించడం గర్వకారణమని తెలిపారు. ఇందులో విజయవాడకు జాతీయస్థాయిలో నేషనల్ క్లీన్ సిటీగా మూడవ ర్యాంకు వచ్చిందని, విశాఖపట్నంకు 10 లక్షలు అంతకంటే ఎక్కువగా ఉన్న జనాభా కేటగిరీలో మొదటి ర్యాంకు వచ్చిందని, గుంటూరు 3 లక్షల నుండి 10 లక్షలు జనాభా కేటగిరిలో మూడవ ర్యాంకు వచ్చిందని ,తిరుపతి - కుప్పం నగరపాలక సంస్థలు స్వచ్ఛ షెహార్ జోడి కేటగిరీలో అవార్డులు సాధించగా, రాజమండ్రి నగరపాలక సంస్థ ఆంధ్రప్రదేశ్లో స్టేట్ ఫస్ట్ క్లీన్ సిటీ కేటగిరీ లో పురస్కారం అందుకుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పరిశుభ్రమైన స్వచ్ఛ ఆంధ్ర, స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధన దిశగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్. సురేష్ కుమార్ మాట్లాడుతూ, స్వచ్ఛత, పారిశుధ్య నిర్వహణ, వ్యర్థాల సమర్థ నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాల్లో రాష్ట్రవ్యాప్తంగా చేపడుతున్న నిరంతర కార్యక్రమాలకు ఈ పురస్కారాలు నిదర్శనమని తెలిపారు. గతంలో స్వచ్ఛ సర్వేక్షణ్ 2024లో సూపర్ స్వచ్ఛ లీగ్ పురస్కారం అందుకున్న విజయవాడ, 2025-26లోనూ అదే ప్రతిష్టాత్మక కేటగిరీలో అవార్డును సాధించడం విశేషమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్.ఎం. మాట్లాడుతూ, దేశంలోనే అత్యున్నత స్వచ్ఛత గుర్తింపుల్లో ఒకటైన సూపర్ స్వచ్ఛ లీగ్ కేటగిరీని 2024లో ప్రవేశపెట్టిన అనంతరం తొలిసారిగా విజయవాడ నగరం ఈ గుర్తింపును సాధించిందని తెలిపారు. ఒకసారి సాధించిన ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును మరోసారి నిలబెట్టుకోవడం ఎంతో సవాలుతో కూడుకున్న విషయమని, 2025-26లో కూడా విజయవాడ నేషనల్ క్లీన్ సిటీ లో మూడవ ర్యాంకు సాధించటం ఎంతో గర్వకారణమని అన్నారు. ఈ విజయానికి కృషి చేసిన ప్రజాప్రతినిధులు, నగర ప్రజలు, పారిశుధ్య కార్మికులు, అధికారులు, సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు, రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు, మీడియా ప్రతినిధులకు ప్రత్యేక అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్) డాక్టర్ డి.చంద్రశేఖర్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ నిర్మల గ్లోరీ పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.