BREAKING
కార్తీక మాసంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు దుర్గమ్మను దర్శించుకున్న సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు యువతలో నాయకత్వ లక్షణాలకు యూత్ పార్లమెంట్ పోటీలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం : కలెక్టర్ డీకే బాలాజీ జనగణన–2027 రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నగర పోలీస్ కమిషనర్ నివాళులు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసుల విస్తృత తనిఖీలు ఆజాద్ ఆశయాలతో విద్యారంగ అభివృద్ధికి లోకేష్ కృషి మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం చందర్లపాడు మండల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా : ఎంపీ కేశినేని చిన్ని విజయవాడకు మరోసారి జాతీయస్థాయి స్వచ్ఛత పురస్కారం కృష్ణా జడ్పీ పీఠంపై ఉత్కంఠ! ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా హోటళ్లు, ఆహార సంస్థలు పనిచేయాలి పోరంకిలో ఘనంగా ‘మైండ్ స్పార్క్’ విజ్ఞాన ప్రదర్శన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు, విద్యా సేవలు చిరస్మరణీయం

జనగణన–2027 రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలి

Select Suryaa Now
జనగణన–2027 రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలి

మచిలీపట్నం మేజర్ న్యూస్ : జనగణన–2027 రెండో దశ జనాభా గణన ప్రక్రియను భారత జనగణన కార్యకలాపాల ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు జిల్లా, ఛార్జ్ స్థాయి జనగణన అధికారులకు నవంబరు 11, 12 తేదీల్లో మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయం యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్‌లో నిర్వహిస్తున్న రెండు రోజుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై దిశానిర్దేశం చేశారు. జనగణనకు సంబంధించిన మార్గదర్శకాలు, నిబంధనలు, సాంకేతిక అంశాలను ప్రతి అధికారి క్షుణ్ణంగా అవగాహన చేసుకోవాలని సూచించారు. శిక్షణలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయి గణకులు, ఇతర సిబ్బందికి సమర్థవంతంగా బదిలీ చేసి, వారికి కూడా సమగ్ర శిక్షణ అందించాలన్నారు. ప్రతి ఇల్లు, కుటుంబానికి సంబంధించిన జనాభా వివరాల సేకరణలో కచ్చితత్వం, పారదర్శకత పాటించాలని, నిర్దేశిత కాలపరిమితిలో జనగణన ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు బాధ్యతతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి, జిల్లా జనగణన అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారి, జిల్లా విద్యాశాఖ అధికారి, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా అటవీ అధికారి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి, సర్వే, భూ రికార్డుల సహాయ సంచాలకులు, గణాంక అధికారి, ఎన్‌ఐసీ జిల్లా ఇన్ఫర్మాటిక్స్ అధికారి, రెవెన్యూ డివిజనల్ అధికారులు, సబ్ డివిజనల్ జనగణన అధికారులు, మచిలీపట్నం నగరపాలక సంస్థ కమిషనర్, ఇతర మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు, సహాయ ఛార్జ్ జనగణన అధికారులు, జనగణన గుమాస్తాలు, సాంకేతిక సహాయకులు, ఏఎస్ఓలు అందుబాటులో లేని చోట జూనియర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఈ రెండు రోజుల శిక్షణలో జనగణన నిర్వహణ విధివిధానాలు, అధికారుల బాధ్యతలు, కార్యాచరణపై అవగాహన కల్పించనున్నారు.


స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.