మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం : కలెక్టర్ డీకే బాలాజీ
మచిలీపట్నం మేజర్ న్యూస్ : భారతరత్న, భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్ర్య సమరయోధుడు, ప్రముఖ విద్యావేత్త మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయమని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పేర్కొన్నారు. ఆజాద్ జయంతిని పురస్కరించుకుని బుధవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కే. శ్రీధర్ రెడ్డి, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి అబ్దుల్ రబ్బాని, డీటీడబ్ల్యూఓ ఫణి ధూర్జటి, కలెక్టరేట్ ఏవో రాధిక తదితరులు పాల్గొని నివాళులర్పించారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, మచిలీపట్నం, కృష్ణాజిల్లా.