ఆజాద్ ఆశయాలతో విద్యారంగ అభివృద్ధికి లోకేష్ కృషి
ఉయ్యూరు మేజర్ న్యూస్ : స్వాతంత్ర్య సమరయోధుడు, భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ఉయ్యూరు పట్టణ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్సీ వై.వి.బి. రాజేంద్రప్రసాద్ ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో విద్యకు అత్యంత కీలక స్థానం ఉందని ఆజాద్ విశ్వసించారని అన్నారు. విద్య ప్రతి ఒక్కరి హక్కు అనే ఆశయంతో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించి, మెరుగైన భవిష్యత్తు కల్పించేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఆజాద్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని విద్యారంగ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చేదుర్తిపాటి ప్రవీణ్, పట్టణ అధ్యక్షులు జంపాన గురునాథం, అబ్దుల్ ఖుద్దూస్, సయ్యద్ అజ్మతుల్లా, జంపన శ్రీనివాస్, కౌన్సిలర్లు కొనపరెడ్డి వాసు, పలియాల శ్రీనివాసరావు, గిరిడి నీలవేణి, జరీనాబేగం, సగిర, నాగరాజు, బొర్రా సుబ్బారావు, చింతయ్య, చినపతి పండు, అబ్దుల్ మాబూద్, ఆల్ రియాజ్, సుభాని, సలీం, నరసింహారావు, నందకిషోర్, చలపాటి శ్రీను, మణికంఠ, రాజులపాటి వెంకట్, ఆసిఫ్, బిస్మిల్లా ఖాన్ గఫర్, మోబీన్, నూరు తదితరులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, పెనమలూరు నియోజకవర్గం, కృష్ణాజిల్లా.