BREAKING
కార్తీక మాసంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు దుర్గమ్మను దర్శించుకున్న సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు యువతలో నాయకత్వ లక్షణాలకు యూత్ పార్లమెంట్ పోటీలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం : కలెక్టర్ డీకే బాలాజీ జనగణన–2027 రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నగర పోలీస్ కమిషనర్ నివాళులు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసుల విస్తృత తనిఖీలు ఆజాద్ ఆశయాలతో విద్యారంగ అభివృద్ధికి లోకేష్ కృషి మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం చందర్లపాడు మండల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా : ఎంపీ కేశినేని చిన్ని విజయవాడకు మరోసారి జాతీయస్థాయి స్వచ్ఛత పురస్కారం కృష్ణా జడ్పీ పీఠంపై ఉత్కంఠ! ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా హోటళ్లు, ఆహార సంస్థలు పనిచేయాలి పోరంకిలో ఘనంగా ‘మైండ్ స్పార్క్’ విజ్ఞాన ప్రదర్శన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు, విద్యా సేవలు చిరస్మరణీయం

ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా హోటళ్లు, ఆహార సంస్థలు పనిచేయాలి

Select Suryaa Now
ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా హోటళ్లు, ఆహార సంస్థలు పనిచేయాలి

విజయవాడ మేజర్ న్యూస్ : ప్రజలకు నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని పరిశుభ్రమైన వాతావరణంలో అందించడం ప్రతి హోటల్, ఆహార సంస్థ బాధ్యత అని ఎన్టీఆర్ జిల్లా పౌర సరఫరాల అధికారి పి. వాణి పేర్కొన్నారు. వ్యాపారాభివృద్ధితో పాటు వినియోగదారుల ఆరోగ్యం, భద్రతకు సమాన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. విజయవాడ కస్తూరిబాయిపేట పుష్ప హోటల్ సెంటర్ సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన కె3 ఫుడ్ జంక్షన్‌ను బుధవారం ఉదయం ఆమె జ్యోతి ప్రజ్వలన చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పి. వాణి మాట్లాడుతూ, పర్యాటక, వాణిజ్య రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ నగరంలో హోటళ్లు, ఆహార వ్యాపార సంస్థలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రజలకు అందుబాటులో నాణ్యమైన ఆహార సేవలు అందించడం ఆహార సంస్థలు తమ బాధ్యతగా గుర్తించాలన్నారు. ఆహార పదార్థాల తయారీలో నాణ్యమైన ముడి సరుకులను మాత్రమే వినియోగించాలని, వంటగది, ఆహార తయారీ ప్రదేశాలు, పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఆహార భద్రతకు సంబంధించిన నిబంధనలు, ప్రమాణాలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఆహార పదార్థాల్లో ఎలాంటి కల్తీకి తావివ్వకూడదని, వినియోగదారుల ఆరోగ్యానికి హాని కలగని నాణ్యమైన ఆహారాన్ని అందించడంలో నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ప్రజారోగ్యానికి భంగం కలిగించే విధంగా ఆహార కల్తీకి పాల్పడితే సంబంధిత నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆహారం అనేది కేవలం ఆకలి తీర్చే సాధనం మాత్రమే కాదని, అది ప్రజల ఆరోగ్యంతో ముడిపడి ఉన్న అంశమని పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు లాభార్జనతో పాటు సేవాభావం, సామాజిక బాధ్యతను కూడా కలిగి ఉండాలని ఆకాంక్షించారు. యువత నూతన ఆలోచనలతో వ్యాపార రంగంలోకి ప్రవేశించి, పర్యాటక, ఆహార రంగాల అభివృద్ధికి దోహదపడటంతో పాటు మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పించాలని సూచించారు. కె3 ఫుడ్ జంక్షన్ నిర్వాహకులు వినియోగదారుల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ నాణ్యత, పరిశుభ్రత, మెరుగైన సేవలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షించి, నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సహాయ పౌర సరఫరాల అధికారి వి. శ్రీనివాసులు, కె3 ఫుడ్ జంక్షన్ నిర్వాహకులు పడవల సాయి తేజ తదితరులు పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.