BREAKING
కార్తీక మాసంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు దుర్గమ్మను దర్శించుకున్న సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు యువతలో నాయకత్వ లక్షణాలకు యూత్ పార్లమెంట్ పోటీలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం : కలెక్టర్ డీకే బాలాజీ జనగణన–2027 రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నగర పోలీస్ కమిషనర్ నివాళులు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసుల విస్తృత తనిఖీలు ఆజాద్ ఆశయాలతో విద్యారంగ అభివృద్ధికి లోకేష్ కృషి మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం చందర్లపాడు మండల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా : ఎంపీ కేశినేని చిన్ని విజయవాడకు మరోసారి జాతీయస్థాయి స్వచ్ఛత పురస్కారం కృష్ణా జడ్పీ పీఠంపై ఉత్కంఠ! ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా హోటళ్లు, ఆహార సంస్థలు పనిచేయాలి పోరంకిలో ఘనంగా ‘మైండ్ స్పార్క్’ విజ్ఞాన ప్రదర్శన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు, విద్యా సేవలు చిరస్మరణీయం

మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం

Select Suryaa Now
మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం

విజయవాడ మేజర్ న్యూస్ : భారత తొలి విద్యాశాఖ మంత్రి, భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి, జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) బుధవారం తన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ మహమ్మద్ ఫారుక్ షుబ్లీ, టీడీపీ మైనారిటీ సెల్ జనరల్ సెక్రటరీ ఫైజాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, దేశ విద్యావ్యవస్థకు బలమైన పునాదులు వేయడంలో ఆజాద్ కీలక పాత్ర పోషించారని, ఖరగ్‌పూర్ ఐఐటీతో పాటు ఉన్నత విద్యాసంస్థల అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. విజయవాడ మతసామరస్యం, సోదరభావానికి ప్రతీకగా నిలుస్తోందని, అన్ని మతాల ప్రజలు పండుగలను ఐక్యతతో జరుపుకోవడం నగర ప్రత్యేకతని అన్నారు. పేద మైనారిటీ విద్యార్థుల విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్ ఆధ్వర్యంలో సుమారు 300 మంది ముస్లిం ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఐఐటీ, వైద్య ప్రవేశ పరీక్షల కోసం రెండు బ్యాచ్‌లుగా ప్రత్యేక శిక్షణ అందించనున్నారని తెలిపారు. పేదరికం ప్రతిభకు అడ్డంకి కాకూడదని, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య, ఉన్నత అవకాశాలు కల్పించడమే లక్ష్యమని పేర్కొన్నారు. మైనారిటీల విద్యా, సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి ప్రభుత్వం అండగా ఉంటుందని ఎంపీ కేశినేని చిన్ని పునరుద్ఘాటించారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.