BREAKING
కార్తీక మాసంలో మల్లేశ్వరస్వామి ఆలయంలో విశేష పూజలు దుర్గమ్మను దర్శించుకున్న సినీ నిర్మాత దిల్ రాజు దంపతులు యువతలో నాయకత్వ లక్షణాలకు యూత్ పార్లమెంట్ పోటీలు మౌలానా అబుల్ కలాం ఆజాద్ సేవలు చిరస్మరణీయం : కలెక్టర్ డీకే బాలాజీ జనగణన–2027 రెండో దశను పకడ్బందీగా నిర్వహించాలి మౌలానా అబుల్ కలాం ఆజాద్‌కు నగర పోలీస్ కమిషనర్ నివాళులు ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా ట్రాఫిక్‌ పోలీసుల విస్తృత తనిఖీలు ఆజాద్ ఆశయాలతో విద్యారంగ అభివృద్ధికి లోకేష్ కృషి మౌలానా ఆజాద్ సేవలు చిరస్మరణీయం చందర్లపాడు మండల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తా : ఎంపీ కేశినేని చిన్ని విజయవాడకు మరోసారి జాతీయస్థాయి స్వచ్ఛత పురస్కారం కృష్ణా జడ్పీ పీఠంపై ఉత్కంఠ! ప్రజారోగ్య పరిరక్షణే లక్ష్యంగా హోటళ్లు, ఆహార సంస్థలు పనిచేయాలి పోరంకిలో ఘనంగా ‘మైండ్ స్పార్క్’ విజ్ఞాన ప్రదర్శన భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు, విద్యా సేవలు చిరస్మరణీయం

భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు, విద్యా సేవలు చిరస్మరణీయం

Select Suryaa Now
భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలు, విద్యా సేవలు చిరస్మరణీయం

విజయవాడ, మేజర్ న్యూస్ : భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి వేడుకలను బుధవారం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ మాట్లాడుతూ, భారత స్వాతంత్ర్య సమరయోధుడిగా, స్వతంత్ర భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రిగా మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి విశేష సేవలందించారని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన పోరాటం, జాతీయ సమైక్యత కోసం చూపిన నిబద్ధత చిరస్మరణీయమని తెలిపారు. కుల, మత, ప్రాంతీయ భేదాలకు అతీతంగా ప్రజలందరూ ఐకమత్యంతో జీవించాలన్న ఆయన సందేశం నేటికీ ఎంతో ప్రాసంగికమని పేర్కొన్నారు. విద్య ద్వారానే సమాజ అభివృద్ధి సాధ్యమని విశ్వసించిన మౌలానా ఆజాద్, దేశంలో విద్యా రంగ అభివృద్ధికి పునాదులు వేశారని తెలిపారు. ముఖ్యంగా ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఆయన చేసిన కృషి భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని విద్యాభివృద్ధికి, సామాజిక సమానత్వానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి మన్నం నరసింహం, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయ సూపరింటెండెంట్ ఎన్.అరవింద్, సీనియర్ అసిస్టెంట్ ఎం.మణికుమార్, జూనియర్ అసిస్టెంట్ జి.నిర్మల కుమారి, సిబ్బంది ఎస్.దివ్య, అబ్దుల్ రహిమాన్, ఉర్దూ అకాడమీ సిబ్బంది పాల్గొన్నారు.

స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.